Encounter: ఎన్ కౌంటర్ పై సుమోటోగా కేసు: స్పాట్ కు నిజ నిర్ధారణ కమిటీ..!
న్యూఢిల్లీ: వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతంలో నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనపై నిజ నిర్ధారణ కమిటీ వేయనుంది. దేశ రాజధాని నుంచి ప్రత్యేక బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించనుంది. దీనిపై సమగ్ర నివేదికను అందించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇదివరకే తెలంగాణ ప్రభుత్వాన్ని సూచించిన విషయం తెలిసిందే.

సుమోటోగా కేసు
తెలంగాణలో షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి ఫ్లైఓవర్ కింద మహమ్మద్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులును శుక్రవారం తెల్లవారు జామున పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం సంఘటనాస్థలానికి తీసుకెళ్లగా వారు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారని. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై దాడికి పాల్పడ్డారని. దీనితో ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందంటూ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన మొత్తాన్నీ జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుంది. మీడియాలో వచ్చిన కథనాలఆధారంగా కేసు స్వీకరించింది.
Recommended Video

సంఘటనా స్థలానికి నిజ నిర్ధారణ కమిటీ..
ఎన్ కౌంటర్ చేయడానికి గల కారణాలు, అక్కడి పరిస్థితులను తెలుసుకోవడానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ త్వరలో ఓ నిజ నిర్ధారణ కమిటీని సంఘటనా స్థలానికి పంపించనుంది. వెటర్నరి డాక్టర్ దిశ అత్యాచారానికి, హత్యకు గురైన శంషాబాద్ తొండుపల్లి టోల్ గేట్ సమీపంలోని స్థలాన్ని, కాలిపోయిన స్థితిలో దిశ మృతదేహం లభించిన చటాన్ పల్లి ఫ్లైఓవర్ ప్రాంతాన్ని నిజ నిర్ధారణ కమిటీ పరిశీలిస్తుంది. దిశ మృతదేహం లభించిన ప్రదేశంలోనే ఎన్ కౌంటర్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

పోలీసుల వాదనలు, మీడియా కథనాలే ఆధారంగా..
నలుగురు అత్యాచార నిందితులను ఎన్ కౌంటర్ చేయడానికి హైదరాబాద్ పోలీసులు వెల్లడించిన కారణాలు, మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని జాతీయ మానవ హక్కుల కమిషన్ తన దర్యాప్తును కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. నిజ నిర్ధారణ కమిటీ ఇచ్చే నివేదికకు ప్రస్తుతం పోలీసులు చెబుతోన్న కారణాలు, సంఘటనాలో గుర్తించిన ఆధారాలు, మీడియా కథనాలను క్రోడీకరించిన అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుందని అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications