ఇప్పుడు చన్నీ వంతు.. కాంగ్రెస్‌ను నాశనం చేస్తాడట.. సిద్దూ కామెంట్స్
నవజ్యోత్ సింగ్ సిద్దూ.. కాంగ్రెస్ పార్టీని బంతిలా ఆడిస్తున్నాడు. తొలుత అమరీందర్ సింగ్‌తో వైరం.. ఇప్పుడు ఆయనను సీఎంగా పక్కన పెట్టేశారు. పంజాబ్ కొత్త సీఎంగా చరణ్ జీత్ సింగ్ ఎన్నికయ్యారు. లోన తనకు రావాల్సిన పదవీ అని ఉంది ఏమో కావొచ్చు.. సీఎంను టార్గెట్ చేశారు సిద్దూ.. ఆయన కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తారని వ్యాఖ్యానించారు.
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. తన సన్నిహితుల వద్ద సీఎం చన్నీ గురించి సిద్ధూ చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లో నలుగురు రైతులు సహా తొమ్మిది మరణాలు చోటుచేసుకున్న లఖింపూర్ ఖేరీ ఘటనను నిరసిస్తూ సిద్ధూ గురువారం ఆందోళన ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో సిద్ధూ..తన పక్కనున్నవాళ్లతో సీఎం చన్నీ 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ముంచేస్తాడని కామెంట్ చేశారు. సిద్ధూ, ఇరత కాంగ్రెస్ నాయకులు మొహాలీ ఎయిర్ పోర్ట్ వద్ద సీఎం చన్నీ కోసం ఎదురుచూస్తున్న సమయంలో సిద్ధూ ఈ కామెంట్ చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో ఆదివారం యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్ ఖేరీ జిల్లాలోని టికునియా-బన్బీర్‌పుర్ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలియజేస్తున్నారు. అక్కడ ఘర్షణ చెలరేగింది. మంత్రుల కాన్వాయ్‌లోని రెండు కార్లు రైతులపై దూసుకెళ్లడంతో నలుగురు రైతులు చనిపోయారు. ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. రైతులపైకి దూసుకెళ్లిన ఓ కారులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తుండగా..అసలు ఆ సమయంలో తాను అక్కడ లేనని ఆశిష్ మిశ్రా చెబుతున్నారు. ఎలాంటి దర్యాప్తుకైనా సిద్దమేనని ఆశిష్ మిశ్రా తెలిపారు
ఉత్తరప్రదేశ్ లఖీమ్‌పూర్ ఘటన చర్చకు దారితీసింది. నిరసన చేస్తోన్న రైతులపై వాహనం వెళ్లనీయడం.. తర్వాత జరిగిన ఉద్రిక్తతలతో 9 మంది వరకు చనిపోయారు. లఖింపూర్ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఘటనకు కారణమైన వారిని ఎంత మందిని గుర్తించారు? ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్ట్ చేశారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై తమకు ప్రభుత్వం నుంచి రిపోర్ట్ కావాలని ధర్మాసనం ఆదేశించింది. నలుగురు రైతులు సహా ఎనిమిది చనిపోయిన ఈ ఘటనలో ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి సుప్రీం ఆరా తీసింది.












Click it and Unblock the Notifications