సీఎం అమరీందర్ సింగ్‌కు షాక్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా నవజోత్ సింగ్ సిద్ధూ నియామకం
న్యూఢిల్లీ/ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చోటు చేసుకుంది. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు, కాంగ్రెస్ పార్టీలో కీలక నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే కొంత అసంతృప్తితో ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూను కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ పదవి కూడా ఇస్తారని ఊహాగానాల ప్రచారం కూడా జరిగింది. అయితే, వాటిని కాంగ్రెస్ అధిష్టానం నిజం చేసింది. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూను నియమిస్తూ ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ప్రకటించారు.

సిద్ధూకు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించే అంశంపై గత కొద్ది రోజులుగా ఆ పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇందుకు సుముఖంగా ఉన్నప్పటికీ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మాత్రం మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. హిందూ, దళిత వర్గాలకు చెందిన సీనియర్లను, పార్టీని ఎప్పట్నుంచో నమ్ముకుని ఉన్నవారిని కాదని సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని హెచ్చరించారు.
పంజాబ్ పీసీసీ పగ్గాలున హిందువులకు ఇస్తే బాగుంటుందని అమరీందర్ సింగ్ సూచించారు. అయితే, అమరీందర్ సింగ్ అభ్యంతరాలను, సూచనలను పక్కన పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం నవజ్యోత్ సింగ్ సిద్ధూకే పార్టీ పగ్గాలు కట్టబెట్టింది. సిద్దూతోపాటు నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, పంజాబ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications