వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ వద్దన్నారు, ఎలా ఉండగలను: బీజేపీపై సిద్ధూ ఫైర్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్ రాజకీయాలకు దూరం చేసేందుకే నాపై కుట్ర పన్నారని, అందుకే బీజేపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా సిద్ధూ సోమవారం మీడియా ముందుకు వచ్చారు.

ఎక్కడ చెడింది?: జైట్లీ ఎఫెక్ట్.. సిద్ధూ రాజీనామా వెనుక!ఎక్కడ చెడింది?: జైట్లీ ఎఫెక్ట్.. సిద్ధూ రాజీనామా వెనుక!

రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయడంపై సిద్ధూ వివరణ ఇచ్చారు. పంజాబ్ వైపు చూడొద్దని నన్ను బీజేపీ అధినాయకత్వం అడిగిందని, అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. పంజాబ్ కంటే నాకు ఏ రాజకీయ పార్టీ గొప్పకాదని సిద్ధూ వ్యాఖ్యానించారు.

పంజాబ్ రాజకీయాలకు నన్ను దూరం చేసేందుకే కుట్ర కూడా పన్నారని బీజేపీపై సిద్ధూ ఫైర్ అయ్యారు. అసలు పంజాబ్‌ను వదిలి ఎలా ఉండగలడని సిద్ధూ చెప్పుకొచ్చారు. పంజాబ్ కంటే నాకు ఏదీ ముఖ్యం కాదని, పంజాబ్ నా మాతృభూమి అని వదిలి ఉండలేనని పేర్కొన్నారు.

బీజేపీకి మరో షాక్: సిద్ధూ బాటలో మరో ఎంపీ సతీమణిబీజేపీకి మరో షాక్: సిద్ధూ బాటలో మరో ఎంపీ సతీమణి

వరుసగా నాలుగోసారి కూడా పంజాబ్‌కు దూరంగా ఉండే ప్రయత్నం బీజేపీ చేసిందని ఆయన అన్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన కారణం చెప్పిన మాజీ క్రికెటర్ సిద్దూ తన రాజకీయ భవిష్యత్తుపై మాత్రం నోరు విప్పలేదు. దీంతో ఆప్‌లో ఆయన చేరనున్నట్లు వస్తున్న వార్తలపై మాత్రం వివరణ ఇవ్వలేదు. దీంతో ఆప్‌లో ఆయన చేరికపై మరింత కాలం సస్పెన్స్ కొనసాగేలానే ఉంది.

వాజపేయి పిలిచారు, మోడీ ముంచారు: సిద్ధూ సంచలన వ్యాఖ్య

వాజపేయి పిలిచారు, మోడీ ముంచారు: సిద్ధూ సంచలన వ్యాఖ్య

మాజీ ప్రధాని వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో తనను బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారని, ఆయన కోరిక మేరకు తాను బీజేపీలోకి వచ్చానని అన్నారు. అయితే ప్రస్తుత ప్రధాని మోడీ మాత్రం తనను ముంచారని ఆయన వ్యాఖ్యానించారు.

వాజపేయి పిలిచారు, మోడీ ముంచారు: సిద్ధూ సంచలన వ్యాఖ్య

వాజపేయి పిలిచారు, మోడీ ముంచారు: సిద్ధూ సంచలన వ్యాఖ్య

తన దృష్టిలో పంజాబ్ కన్నా పార్టీ పదవులు, హోదాలు ముఖ్యం కాదని అన్నారు. 2004లో మరో 14 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయన్న వేళ తాను బీజేపీలో చేరానని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఉత్తర భారతదేశంలో తానొక్కడినే బీజేపీ నుంచి విజయం సాధించానని చెప్పారు.

 వాజపేయి పిలిచారు, మోడీ ముంచారు: సిద్ధూ సంచలన వ్యాఖ్య

వాజపేయి పిలిచారు, మోడీ ముంచారు: సిద్ధూ సంచలన వ్యాఖ్య

కాగా, సిద్ధూ మీడియా సమావేశం అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. "సిద్ధూ పంజాబ్ వెళితే, అక్కడ కొనసాగుతున్న మాదక ద్రవ్యాల సామ్రాజ్యంపై స్పందిస్తారు. వారిని సిద్ధూ బారిన పడకుండా బీజేపీ రక్షించాలని చూస్తోంది. ఇదో షాకింగ్" అని వ్యాఖ్యానించారు.

వాజపేయి పిలిచారు, మోడీ ముంచారు: సిద్ధూ సంచలన వ్యాఖ్య

వాజపేయి పిలిచారు, మోడీ ముంచారు: సిద్ధూ సంచలన వ్యాఖ్య

అమృత్‌సర్ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన సిద్ధూ 2014లో ఆ స్థానాన్ని అరుణ్ జైట్లీ కోసం వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయనను పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారు.

English summary
Ex bjp mp Navjot Singh Sidhu explained why resigned for rajya sabha mp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X