పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయం: సిద్ధూ సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అప్పుడే అక్కడ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ క్రికెటర్‌, ఆవాజ్-ఏ-పంజాబ్ వ్యవస్థాపకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంజాబ్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని ప్రకటించారు. పంజాబ్‌ అభివృద్ధి కోసం రాజకీయ ఫ్రంట్‌ను మాత్రమే స్థాపించానని ఆవాజ్‌-ఇ-పంజాబ్‌ రాజకీయ పార్టీ కాదని ఈ సందర్భంగా సిద్ధూ స్పష్టం చేశారు.

Navjot Singh Sidhu

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే కూటమిలో చేరాలని అనుకుంటున్నామని, ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు చీల్చాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు. పంజాబ్ అభివృద్ధి కోసం తమ ఫ్రంట్‌లో చేరాలని పార్టీలను ఆయన ఆహ్వానించారు. తాము పోటీకి దిగితే అధికార అకాలీదళ్ ప్రభుత్వం లాభపడే అవకాశముందని సిద్ధూ అభిప్రాయపడ్డారు.

కొత్త పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే కనీసం రెండేళ్లు పడుతుందని, మూడు నెలలు చాలా తక్కువ సమయమని సిద్ధూ పేర్కొన్నారు. ఆవాజ్-ఏ-పంజాబ్ తో ఆమ్ ఆద్మీ పార్టీ సంప్రదింపులు జరుపుతోందని ఊహగానాలు వస్తున్న నేపథ్యంలో సిద్ధూ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో 117 నియోజక వర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని గతంలో సిద్ధూ ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరుని ప్రకటించిన సందర్భంగా పంజాబ్‌కు తిరిగి పునర్వైభవం తీసుకురావడం కోసమే 'ఆవాజ్-ఇ- పంజాబ్' పార్టీని స్థాపించినట్లు సిద్ధూ పేర్కొన్న సంగతి తెలిసిందే.

గత జులైలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సిద్ధూ రాజకీయాల్లో ఉన్నది ప్రజలకు సేవ చేయడానికే కానీ సొంత ప్రయోజనాల కోసం కాదని చెప్పారు. భారత హాకీ మాజీ కెప్టెన్‌, బీజేపీ మాజీ ఎంపీ పర్గత్‌ సింగ్‌, అధికార పార్టీ శిరోమణి అకాలీదళ్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు బల్విందర్‌ సింగ్‌, సిమర్‌జీత్‌ సింగ్‌లతో పాటు పలువురు సిద్ధూ స్థాపించిన ఆవాజ్‌-ఇ-పంజాబ్‌లో చేరారు. బీజేపీ తరఫున రాజ్యసభకు ఎంపికైన సిద్ధూ జులై 18న రాజీనామా చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+