భార్య తర్వాత, ఇక 'వీడియోలు': ఇరకాటంలో సిద్ధూ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పైన తాను చేసిన వ్యాఖ్యలతో రాజ్యసభ పదవికి, బీజేపీకి రాజీనామా చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇరకాటంలో పడ్డారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

సిద్ధూ చాలా ఏళ్ల పాటు బీజేపీలో ఉన్నారు. ఎంపీగా కొనసాగారు. బీజేపీ నేతగా సిద్ధూ.. కేజ్రీ పైన దుమ్మెత్తి పోసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను బీజేపీ కార్యకర్తలు బయటకు తీసుకు వస్తున్నారు.

Navjot Singh Sidhu’s past statements on Kejriwal may come back to haunt him

ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేసిన సిద్ధూ.. ఇవాళో రోపే ఏఏపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. ఆయన విమర్శలు పంజాబ్ టీవీ చానళ్లలో మారుమోగుతున్నాయి. గతంలో పలు సందర్భాల్లో కేజ్రీవాల్ పైన ఆయన చేసిన తీవ్ర విమర్శల వీడియోలు విస్తృతంగా ప్రసారం అవుతున్నాయి.

దీంతో, సిద్ధూ కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆందోళనల పేరిట కేజ్రీవాల్ డ్రామాలు చేస్తున్నాడని, రాజకీయాల్లోకి రానంటూ పార్టీ పెట్టారని, వ్యక్తిగత భద్రత, ప్రభుత్వ బంగళా వద్దని తొలుత చెప్పి, ఆపై సకల సౌకర్యాలనూ అనుభవిస్తున్నారని, వ్యక్తిగత భద్రత వద్దని, ఆ తర్వాత జెడ్ కేటగిరీ భద్రత తీసుకున్నారని, సిద్ధూ చేసి విమర్శల వీడియోలు సోషల్ మీడియాలోను దుమ్ము రేపుతున్నాయి.

కాగా, ఇప్పటికే సిద్ధూ బార్య తాను తన భర్త దారిలో నడవనని చెప్పిన విషయం తెలిసిందే. తాను బిజెపిలోనే కొనసాగుతానన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Navjot Singh Sidhu’s past statements on Kejriwal may come back to haunt him.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి