శివసేన ఎంపీ బెదిరింపులు: ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు నవనీత్ రాణా లేఖ

ముంబై: మహారాష్ట్ర హోంమంత్రిపై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ ఆరోపణలు కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. దీనిపై పార్లమెంటులో వాడివేడీ చర్చ జరిగింది. పరమ్ వీర్ ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని అమరావతి ఎంపీ నవనీత్ రాణా డిమాండ్ చేశారు. మహారాష్ట్ర మహా వికాస్ అఘాడీ సర్కారుపై ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు చేశారు.

పార్లమెంటు ఆవరణలో శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను బెదిరింపులకు గురిచేశారని నవనీత్ మీడియాకు తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైళ్లో వేస్తామని హెచ్చరించారని ఆమె చెప్పారు. దీనిపై ఇప్పటికే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు.

 Navneet Rana writes to PM Modi, Amit Shah, demanding probe on Sena MPs threat

అంతేగాక, తనపై యాసిడ్ దాడి చేస్తామంటూ తనకు ఫోన్లో బెదిరింపులు వస్తున్నాయని నవనీత్ కౌర్ రాణా ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఆమె ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

Recommended Video

    Covid-19 : Union Health Minister Harsh Vardhan On 'Second Peak' Of Covid-19 || Oneindia Telugu

    ఇప్పటికే మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వ్యవహారంలో తలలు పట్టుకుంటున్న శివసేనను.. ఇప్పుడు ఆ పార్టీ ఎంపీ అరవింద్ సావంత్ తీరు మరిన్ని ఇబ్బందుల్లో పడేసేలా ఉంది. కాగా, నవనీత్ ఆరోపణలను అరవింత్ సావంత్ ఖండిస్తున్నారు. ఆమెను తాను ఎప్పుడూ బెదిరించలేదన్నారు. అంతేగాక, ఎవరైనా ఆమెపై దాడికి వస్తే.. తానే అడ్డుకుంటానని, దాడి చేసే నైజం తనది కాదని చెప్పుకొచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+