నలుగురు కానిస్టేబుళ్లను కిడ్నాప్ చేసిన మావోలు

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో నలుగురు పోలీసు కానిస్టేబుళ్లను సాయుధ మావోయిస్టులు అపహరించారు. రాష్ట్ర పోలీసు శాఖ అనుబంధ సిబ్బందిగా నియమించుకున్న వీరిని కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బస్సులో ప్రయాణిస్తుండగా నక్సల్స్ అపహరించుకుపోయారని అడిషనల్ డిజిపి(నక్సల్స్ ఆపరేషన్స్) ఆర్‌కే విజ్ చెప్పారు.

అపహరణకు గురైనవారు అసిస్టెంట్ కానిస్టేబుల్ హోదాలో ఉన్నారని తెలిపారు. మావోయిస్టులు అపహరించినవారిలో జయదేవ్ యాదవ్, మంగళ్ సోధి, రాజు తేలా, రామా మజ్జి ఉన్నారు.

 Naxals' menace continues: 4 police officials abducted in Chhattisgarh

నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో రాష్ట్ర పోలీసులకు సహకరించేందుకు ఈ నలుగురు కానిస్టేబుళ్లు నియమితులయ్యారు. ఇలా నియమించిన వారిని ఫాలోవర్స్ అని కూడా పిలుస్తారు. ఈ ఘటన గురించి తెలియగానే వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే వారి ఆచూకీ ఇంత వరకూ తెలియరాలేదు.

సొహ్రాబుద్దీన్ కేసు నుంచి ఐపీఎస్‌కు విముక్తి

సొహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు నుంచి ఐపిఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంకు సిబిఐ కోర్టు విముక్తి కల్పించింది. బాలసుబ్రహ్మణ్యంపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలను నిరూపించే సాక్ష్యాధారాలు లేకపోవడంతో సిబిఐ కోర్టు జడ్జి ఎంబి గోస్వామి సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+