Mumbai: బాలీవుడ్ నిర్మాత మీద ఎన్ సీబీ పంజా, సుశాంత్ సింగ్ కేసులో జస్ట్ మిస్, ఆర్యన్ ఖాన్ దెబ్బతో !
ముంబాయి/బెంగళూరు: ముంబాయి బిగ్ షాట్స్ పిల్లల డ్రగ్స్ కేసులో ఎన్ సీబీ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు షాక్ ఇచ్చిన ఎన్ సీబీ అధికారులు ఇప్పుడు బాలీవుడ్ సినీ పరిశ్రమకు మరో షాక్ ఇచ్చారు. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత ఇల్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో ఎన్ సీబీ అధికారులు సోదాలు ముమ్మరం చెయ్యడంతో బాలీవుడ్ లోని కొందరు ప్రముఖులు ఉలిక్కిపడ్డారు, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఈ నిర్మాత ఎన్ సీబీ దెబ్బ నుంచి జస్ట్ మిస్ అయ్యాడు. ఎన్ సీబీ సింహస్వప్నం సమీర్ వాఖండే దెబ్బతో బాలీవుడ్ లోని కొందరికి కంటి మీద కునుకులేకుండా పోయింది. బాలీవుడ్ నిర్మాతకు చెందిన వివరాలు చెప్పడానికి ఎన్ సీబీ అధికారి సమీర్ వాఖండే నిరాకరించారు. త్వరలో బాలీవుడ్ కు మరో షాక్ ఇవ్వడానికి ఎన్ సీబీ అధికారులు సిద్దం అవుతున్నారని తెలిసింది. ఆ బాలీవుడ్ నిర్మాతకు విచారణకు హాజరుకావాలని ఎన్ సీబీ అధికారులు సమన్లు జారీ చేశారని తెలిసింది.

బాలీవుడ్ నిర్మాత ఇంతియాజ్ కు మైండ్ బ్లాక్
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు షాక్ ఇచ్చిన ఎన్ సీబీ అధికారులు ఇప్పుడు బాలీవుడ్ సినీ పరిశ్రమకు మరో షాక్ ఇచ్చారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఇంతియాజ్ ఖత్రియా ఇల్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో ఎన్ సీబీ అధికారులు సోదాలు ముమ్మరం చెయ్యడంతో బాలీవుడ్ లోని కొందరు ప్రముఖులు ఉలిక్కిపడ్డారు,

సుశాంత్ సింగ్ కేసులో జస్ట్ మిస్
బాలీవుడ్ హీరె సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) ఆత్మహత్య కేసు సమయంలోనే బాలీవుడ్ నిర్మాత ఇంతియాజ్ ఖత్రియా పేరు చర్చకు దారితీసింది, సుశాంత్ సింగ్, రియా చక్రవర్తికి బాలీవుడ్ నిర్మాత ఇంతియాజ్ ఖత్రియా డ్రగ్స్ సరఫరా చేసేవాడని సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ శృతి మోదీ న్యాయవాది అశోక్ సరోగి అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఇంతియాజ్ పేరు బాలీవుడ్ లో తీవ్ర చర్చకు దారితీసినా ఆ సమయంలో ఎన్ సీబీ అధికారుల నుంచి ఇంతియాజ్ తప్పించుకున్నారని తెలిసింది.

ఈసారి ఏం జరుగుతుందో ?
శనివారం ముంబాయిలోని బాలీవుడ్ నిర్మాత ఇంతియాజ్ ఖత్రియా నివాసం, కార్యాలయంలో సోదాలు చేసిన ఎన్ సీబీ అధికారులు కొన్ని పత్రాలు సీజ్ చేశారని తెలిసింది. ఎన్ సీబీ సింహస్వప్నం సమీర్ వాఖండే దెబ్బతో బాలీవుడ్ లోని కొందరికి కంటి మీద కునుకులేకుండా పోయింది. బాలీవుడ్ నిర్మాతకు చెందిన వివరాలు చెప్పడానికి ఎన్ సీబీ అధికారి సమీర్ వాఖండే నిరాకరించారని ముంబాయి మీడియా అంటోంది.

ఆర్యన్ ఖాన్ ఉప్పు అందించాడా ?
ముంబాయి నుంచి గోవా వెలుతున్న క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ జరుపుతున్న సమయంలో ఎన్ సీబీ అధికారులు దాడులు చేసి బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తో సహ చాలా మందిని అరెస్టు చేశారు. ఎన్ సీబీ అరెస్టు చేసిన వారిలో నైజీరియా జాతీయుడు కూడా ఉన్నాడని సమాచారం. ఆర్యన్ ఖాన్ ఇచ్చిన సమాచారం మేరకే బాలీవుడ్ నిర్మాత ఇంతియాజ్ మీద ఎన్ సీబీ అధికారులు పంజా విసిరారని బాలీవుడ్ లో కొందరు గుసగుసలాడుతున్నారని తెలిసింది. ఆ బాలీవుడ్ నిర్మాతకు విచారణకు హాజరుకావాలని ఎన్ సీబీ అధికారులు సమన్లు జారీ చేశారని తెలిసింది.

డ్రగ్స్ కేసు కలకలం రేపుతుందా !
షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దెబ్బతో బాలీవుడ్ లోని ఓ వర్గం ఉలిక్కిపడుతున్నది. ఇప్పుడు బాలీవుడ్ నిర్మాత ఇంతియాజ్ మీద ఎన్ సీబీ అధికారులు పంజా విసిరడంతో కథ కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని తెలిసింది. ముంబాయి డ్రగ్స్ కేసు వ్యవహారంతో ఎన్ సీబీ అధికారులు తీరకలేకుండా గడుతున్నారని తెలిసింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications