దేశ విభజనకు కారణం ముగ్గురే-NCERT మరో వివాదం-కాంగ్రెస్, ఓవైసీ ఫైర్..!

ఎప్పుడో 1947లో జరిగిన దేశ విభజన గాయాల్ని గుర్తుచేస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రచారానికి ఇప్పుడు జాతీయ విద్యావిషయక పరిశోధన మండలి (ఎన్సీఈఆర్టీ) కూడా జతకలిసింది. అప్పట్లో జరిగిన ఘటనల్ని విద్యార్ధులకు పాఠాల రూపంలో అందించే క్రమంలో తాజాగా రూపొందించిన ప్రత్యేక పాఠంలో పేర్కొన్న అంశాల్లో కాంగ్రెస్ పార్టీని, ముస్లింలను టార్గెట్ చేసింది. దీంతో ఈ రెండు వర్గాలు ఎన్టీఈఆర్టీ తీరుపై మండిపడుతున్నాయి.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని మెప్పించే క్రమంలో వరుసగా పాఠ్యాంశాల్లో వివాదాస్పద అంశాల్ని చొప్పిస్తున్న ఎన్సీఈఆర్టీ మరో తేనెతుట్టె కదిపింది. 1947లో జరిగిన దేశ విభజన గాయాలను విద్యార్ధులకు పరిచయం చేసే క్రమంలో ఈ ఘటనలకు ముగ్గురు ప్రధాన కారణమంటూ పేర్కొనడం వివాదాస్పదమైంది. అప్పట్లో ఏకగ్రీవంగా జాతీయ నేతలు తీసుకున్న నిర్ణయాల్ని ముగ్గురికి ఆపాదిస్తూ ఎన్టీఈఆర్టీ ఈ పాఠ్యాంశాల్ని రూపొందించింది. ముస్లింలీగ్ నేత మొహమ్మద్ అలీ జిన్నా దేశ విభజనను ప్రతిపాదిస్తే భారత జాతీయ కాంగ్రెస్ దాన్ని ఆమోదించిందని, చివరి వైశ్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ దాన్ని అమలు చేశాడని ఆరోపించింది.

NCERT s Updated Partition Module Points Finger at Three Culprits Criticizes Congress and Owaisi

దేశ విభజన కాశ్మీర్ ను దేశానికి కొత్త భద్రతా సమస్యగా మార్చిందని ఇందులో ఎన్సీఈఆర్టీ పేర్కొంది. అప్పటి నుంచీ పొరుగుదేశాల్లో ఒకటి దీన్ని భారత్ కు పలు సమస్యలు తెచ్చిపెట్టేందుకు వాడుకుంటోందని పాకిస్తాన్ నుద్దేశించి వెల్లడించింది. 1940లో జిన్నా హిందూ-ముస్లింలు రెండు వేర్వేరు గ్రామాలు, భావజాలాలు, సాంఘిక ఆచారాలు, సాహిత్యం కలిగిన వారని చెప్పినట్లు తెలిపింది. బ్రిటీష్ వాళ్లు భారత్ ను ఐక్యంగా ఉంచేందుకు ప్రయత్నించారని అయితే కాంగ్రెస్ దాన్ని ఒప్పుకోలేదని పేర్కొంది. భారత్ ను ఏకం చేసిన వల్లభాయి పటేల్ కూడా అంతర్గత యుద్ధం నివారించాలంటే విభజనే మార్గం అన్నారని తెలిపింది. అలాగే గాంధీ విభజనను వ్యతిరేకించినప్పటికీ హింస ద్వారా కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకించనని చెప్పారంది.

NCERT s Updated Partition Module Points Finger at Three Culprits Criticizes Congress and Owaisi

ఎన్సీఆర్టీ వాదనపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. వాస్తవాలు చెప్పని ఈ పాఠ్యాంశాన్ని తగులపెట్టాలని కాంగ్రెస్ అధికారప్రతినిధి పవన్ ఖేరా డిమాండ్ చేశారు. హిందూ మహాసభ , ముస్లిం లీగ్ మధ్య సమన్వయంతో విభజన జరిగిందని తెలిపారు. విభజన ఆలోచన ముందుగా చేసింది 1938లో హిందూ మహాసభేనని, దీన్ని జిన్నా 1940లో రిపీట్ చేశారన్నారు. అటు ఎంఐఎం అధినేత ఓవైసీ సైతం ఎన్సీఈఆర్టీ ముస్లింలను విభజన దోషులుగా చూపించడంపై మండిపడ్డారు.

NCERT s Updated Partition Module Points Finger at Three Culprits Criticizes Congress and Owaisi

ఇందులో షంసుల్ ఇస్లాం రాసిన 'ముస్లింస్ ఎగైనెస్ట్ పార్టిషన్' పుస్తకాన్ని కూడా చేర్చాలన్నారు. ఈ అబద్ధం విభజన గురించి పదే పదే చెబుతోందని, ఆ సమయంలో 2-3 శాతం ముస్లింలకు కూడా ఓటు హక్కు లేదన్నారు. ఇవాళ ప్రజలు విభజనకు తమను నిందిస్తున్నారని, దానికి మేం ఎలా బాధ్యులమన్నారు. ఇక్కడి నుండి పారిపోయిన వారు పారిపోయారు, విశ్వాసపాత్రులుగా ఉన్నవారు అక్కడే ఉండిపోయారని గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+