గూగుల్‌కు చుక్కలు చూపించిన ఎన్సీఎల్ఏటీ..!!
న్యూఢిల్లీ: టాప్ సెర్చింజిన్ గూగుల్ కు నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది. ఈ మేరకు గూగుల్ యాజమాన్యానికి ఉత్తర్వులు ఇచ్చింది. ఈ జరిమాన విలువ 1,337.76 కోట్ల రూపాయల్లో 10 శాతం. 2022 అక్టోబర్ లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గూగుల్ పై విధించిన ఫైన్ ఇది. ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించాల్సిందేనని ఆదేశించింది. ఈ విషయంలో సీసీఐ ఆదేశాలను సమర్థించింది.
ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకోసిస్టమ్ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు పెనాల్టీని చెల్లించాలంటూ గతంలోనే గూగుల్ యాజమాన్యంపై కాంపిటీషన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై గూగుల్ యాజమాన్యం నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ లో సవాల్ చేసింది. ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది.

ఈ పిటీషన్ ను ఎన్సీఎల్ఏటీ న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ అలోక్ శ్రీవాస్తవతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సీసీఐ విధించిన జరిమానాపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. అప్పీలెంట్ గూగుల్.. తాను చెల్లించాల్సిన జరిమానా మొత్తంలో 10 శాతాన్ని తాత్కాలికంగా రిజిస్ట్రార్ వద్ద డిపాజిట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం ఈ కేసుపై తదుపరి విచారణను ఫిబ్రవరి 13వ తేదీకి వాయిదా వేసింది.
గూగుల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ తన ఎన్సీఎల్ఏటీ ధర్మాసనం ముందు తన వాదనలను వినిపించారు. యూరోపియన్ యూనియన్ తీర్పులోని పలు భాగాలను వర్డ్ టు వర్డ్ సీసీఐ కాపీ చేసిందని పేర్కొన్నారు. యూరోపియన్ కమిషన్ నిర్ణయాలు సీసీఐకి వర్తించబోవని, భారత్ లోని చట్టాలు దీనికి అంగీకరించవని చెప్పారు.
ఫైన్ విధిస్తూ సీసీఐ తీసుకున్న నిర్ణయం వల్ల గూగుల్ తన వ్యాపార కార్యకలాపాలను మార్చుకోవాల్సి వస్తుందని, ఇది యూజర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని మను సింఘ్వీ అన్నారు. నిష్పాక్షిక, చట్టబద్ధంగా విచారణను జరిపించడంలో సీసీఐ విఫలమైందని అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. గూగుల్ మొబైల్ యాప్ పంపిణీ పద్ధతులు పోటీకి అనుకూలమైనవని వివరించారు. కాగా సీసీఐ ఇచ్చిన ఈ ఆదేశాలపై తాము అప్పీల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు గూగుల్ అప్పట్లోనే తెలిపింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications