బీజేపీలోకి అజిత్ పవార్ ? శరద్ పవార్ రియాక్షన్ ఇదే...
ఎన్సీపీ నేత అజిత్ పవార్ పార్టీని వీడి బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మహా వికాస్ అఘాడీ కూటమిలో ఉన్న ఎన్సీపీని వీడి ఆయన పార్టీ మారుతున్నట్లు జరుగుతన్న ప్రచారం నేపథ్యంలోఆయనతో భేటీ అయిన ఎన్సీపీ అధినేత, ఆయన మేనమామ శరద్ పవార్ ఈ మొత్తం వ్యవహారంపై స్పందించారు. పవార్ గురించి వస్తున్న వార్తలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్సీపీ నేత అజిత్ పవార్ భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరుతున్నారనే పుకార్లను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ ఖండించారు. ఈ పుకార్లు కేవలం మీడియా మదిలో ఉన్నాయని తెలిపారు. మన తలరాతల్లో లేవని అన్నారు. దీనికి సంబంధించి ఏ పార్టీ సమావేశానికి తాను అధ్యక్షత వహించానన్న వాదనలను పవార్ ఖండించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ అధికార భారతీయ జనతా పార్టీలో చేరడం గురించి ఆలోచిస్తున్నారనే ఊహాగానాల మధ్య పవార్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.

మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని వీడబోతున్నారనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా..అనర్హత వేటు పడకుండా ఉండాలంటే ఇందులో నాలుగింటి మూడో వంతు ఎమ్మెల్యేలు ఆయనతో పాటు వెళ్లాలి. కానీ అలా జరిగే అవకాశాలు తక్కువే. అయినా ముందు జాగ్రత్తగా శరద్ పవార్.. అజిత్ తో కీలక చర్చలు జరిపి ఆయన్ను బుజ్జగించినట్లు తెలుస్తోంది.
పవార్ పార్టీ మార్పు వార్తలపై మాట్లాడిన శరద్ పవార్.. ఆయన ఎన్నికల వ్యవహారాల్లో బిజీగా ఉన్నారని తెలిపారు. అలాగే పవార్ కుమార్తె సుప్రియా సూలే సైతం దీన్ని లైట్ తీసుకున్నారు. 15 రోజుల్లో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని, ఇందులో ఒకటి ఢిల్లీలో, రెండవది మహారాష్ట్రలో ఉంటాయన్నారు. దీంతో సుప్రియ వ్యాఖ్యలపైనా ఇప్పుడు చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications