వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజిత్ పవార్ షాకింగ్ నిర్ణయంతో ఎన్సీపీ కి సంబంధం లేదు : శరద్ పవార్

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అనూహ్యంగా మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. నిన్నటి వరకు కాంగ్రెస్, ఎన్సీపీ , శివసేన కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావించగా ఊహించని విధంగా రాత్రికి రాత్రే రాజకీయాల్లో పరిణామాలు మారిపోయాయి. ఎన్సీపీలో చీలికతో మహారాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా నడిచింది. శరద్ పవార్ తమ్ముడి కొడుకు అజిత్ పవార్ అనూహ్యంగా బీజేపీకి మద్దతు ప్రకటించడంతో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

శరద్ పవార్‌కు అజిత్ షాక్: ఎన్సీపీలో రెండు వర్గాలుగా: శివసేన ఎమ్మెల్యేలకు గాలం..శరద్ పవార్‌కు అజిత్ షాక్: ఎన్సీపీలో రెండు వర్గాలుగా: శివసేన ఎమ్మెల్యేలకు గాలం..

ఉదయం 8 గంటలకు రాజ్ భవన్‌లో ఫడ్నవీస్‌చేత గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం అవడం ఇది రెండవసారి. అయితే.. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు.. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.మొత్తానికి మహా పీఠంపై మరోమారు బీజేపీ చక్రం తిప్పింది. అయితే ఇది వెన్ను పోటు అని కాంగ్రెస్ వర్గాలు శరద్ పవార్ మీద విరుచుకుపడుతున్నాయి.

NCP had no hands with Ajit Pawars shocking decision: Sharad Pawar

బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరాలని అజిత్ పవార్ తీసుకున్న షాకింగ్ నిర్ణయంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రమేయం లేదని, అందులో ఎవరి పాత్ర లేదని శరద్ పవార్ చెప్పారు. అజిత్ పవార్ స్వయంగా ఈ నిర్ణయానికి వచ్చారని చెప్పారు.ఇతర ఎన్సీపీ నాయకులు సైతం ఎన్సీపీ వెన్నుపోటు పొడిచిందని వస్తున్న వార్తలను ఖండించారు. ఇది వారికి సైతం షాకింగ్ గా ఉందని చెప్పారు. శరద్ పవార్ కు తెలీకుండానే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. చాగన్ భుజ్బాల్, నవాబ్ మాలిక్, జయంత్ పాటిల్ మరియు జితేంద్ర అవహాద్ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి తమకు తెలియదని అన్నారు. ప్రఫుల్ పటేల్, శరద్ పవార్‌ కు ఈ వ్యవహారంలో ఎటువంటి సంబంధం లేదని అన్నారు.

Recommended Video

Devendra Fadnavis Takes Oath As Maharashtra CM || డిప్యూటీగా అజిత్ పవార్

English summary
Sharad Pawar says his Nationalist Congresss Party had no hands in his nephew Ajit's astounding decision to join a BJP-led government.Ajit Pawar himself said he reached the decision on his own.Other Nationalist Congress Party leaders -- Chhagan Bhujbal, Nawab Malik, Jayant Patil and Jitendra Awahad -- said they had no idea of what was to come. Praful Patel said Sharad Pawar had nothing to do with it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X