Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జనాభా నియంత్రణపై మహిళలనుద్దేశించి సీఎం నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ/ పాట్నా: జనాభా నియంత్రణ సాధ్యం కావాలంటే మహిళలకు విద్య ఎంత అవసరమో చెబుతూ బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ (Nitish Kumar) ఆ రాష్ట్ర అసెంబ్లీలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో నితీష్ అసభ్యకరంగా మాట్లాడారంటూ ప్రతిపక్ష బీజేపీ విమర్శించింది. ఆయన వ్యాఖ్యలను తమను బాధించాయని ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు అన్నారు. మరోవైపు, జాతీయ మహిళ కమిషన్.. సీఎం నితీష్ కుమార్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

బీహార్ రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన సమగ్ర కులగణన నివేదికపై సీఎం నితీష్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. 'భర్తల చేష్టల కారణంగా మరిన్ని జననాలు సంభవిస్తున్నాయి. అయితే, చదువుకున్న స్త్రీలు వాటిని కట్టడి చేస్తున్నారు. దీంతో జననాలు తగ్గుముఖం పడుతున్నాయి' అని వ్యాఖ్యానించారు. చదువుకున్న మహిళలు గర్భం రాకుండా జాగ్రత్త పడతారని చెప్పారు.

NCW demands Nitish Kumar’s apology for population control remarks

అంతకుముందు బీహార్ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 4.3 శాతం ఉండగా.. గత ఏడాది అది 2.9 శాతానికి పడిపోయింది. ఈ విషయం జర్నలిస్టులతో సహా సభలోని మిగితావారికీ తెలుసని అన్నారు. త్వరలో సంతానోత్పత్తి రేటు 2 శాతానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం నితీష్ కుమార్.

ఈ నేపథ్యంలో నితీష్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. సీఎం నితీష్ రాష్ట్రంలోని మహిళలను అవమానించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి అన్నారు. మరోవైపు, నితీష్ కుమార్ మాట్లాడిన దాంట్లో తప్పు లేమీ లేదని డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సీఎంకు మద్దతు పలికారు. పాఠశాలల్లో లైంగిక విద్యలో భాగంగా విద్యార్థులకు ఇలాంటి అంశాలను బోధిస్తారని అన్నారు. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే నీతు దేవి కూడా నితీష్ వ్యాఖ్యలకు మద్దతు పలకడం గమనార్హం.

ఇది ఇలావుండగా, జాతీయ మహిళా కమిషన్.. సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలను తప్పబట్టింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమని పేర్కొంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ, ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలీవాల్ డిమాండ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+