ఎన్‌డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ఖరారుచేసిన బిజెపి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేరును బిజెపి పార్లమెంటరీ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు.

వెంకయ్యనాయుడు సుదీర్ఘకాలంపాటు రాజకీయాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని చవటపాలెంకు చెందిన వెంకయ్యనాయుడు తొలుత జనసంఘ్, బిజెపిలలో పనిచేశారు.

కేంద్రమంత్రిగా వాజ్‌పేయ్ క్యాబినెట్‌లో పనిచేశారు. ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో కూడ ఆయన కీలక మంత్రిత్వశాఖలను నిర్వహిస్తున్నారు

venkaiahnaidu

వెంకయ్యనాయుడు సుదీర్ఘకాలంపాటు రాజకీయాల్లో ఉన్నారుసోమవారం సాయంత్రం ఢిల్లీలో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీబోర్డు సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయమై చర్చించారు. పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి.

వాగ్దాటికి వెంకయ్య మారుపేరు, లోటేనన్న బాబు

వెంకయ్యనాయుడైతేనే అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకొన్నామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తర్వాత ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకొన్నారు.

ఈ సమావేశం నుండే ప్రధానమంత్రి మోడీ ఎన్‌డిఏ భాగస్వామ్యపక్షాలకు ఫోన్ చేసి వెంకయ్యనాయుడిపేరును ప్రకటించారు. వారి మద్దతునుకోరారు. వారు కూడ సానుకూలంగా స్పందించారు.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కూడ ప్రధానమంత్రి మోడీ ఫోన్ చేసి వెంకయ్యకు మద్దతివ్వాలని కోరారు.

Venkaiah Naidu To Be First Vice President If Elected

వెంకయ్యనాయుడు విజయం నల్లేరుమీద నడకేననే అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా ఆయన ఎన్నికైతే ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన మూడో వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bjp parliamentary party meeting decided to NDA's vice presidential candidate venkaiah naidu.Monday evening parliamentary party held at Delhi.
Please Wait while comments are loading...