ఎన్డిటివి సర్వే: అతి పెద్ద మూడో పార్టీ జయలలితదే
న్యూఢిల్లీ: లోకసభలో అతి పెద్ద మూడో పార్టీగా జయలలిత నాయకత్వంలోని అన్నాడియంకె అవతరించే అవకాశం ఉందని ఎన్డీటివి ఎగ్జిట్ పోల్ సర్వే తెలియజేస్తోంది. తమిళనాడులోని 39 లోకసభ స్థానాల్లో అన్నాడియంకె 32 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కరుణానిధి నాయకత్వంలోని డిఎంకె ఐదు సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని సర్వే తెలియజేస్తోంది.
ఎన్డీటివి ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం - తమిలనాడులో బిజెపి రెండు సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెసు ఖాతా తెరిచే అవకాశం లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెసు 8 సీట్లు గెలుచుకుంది. బిజెపికి అదనంగా ఓ సీటు రానుంది.

డిఎంకె 14 సీట్లను కోల్పోతోంది. గత ఎన్నికల్లో ఈ పార్టీ 19 లోకసభ స్థానాలను గెలుచుకుని యుపిఎలో ప్రధాన పాత్ర పోషించింది. అన్నాడియంకె 23 సీట్లను అదనంగా పొందుతోంది. గత ఎన్నికల్లో 9 సీట్లను గెలుచుకుంది.
బిజెపి నాయకత్వంలోని ఎన్డియెకు స్పష్టమైన మెజారిటీ వస్తుందనే అంచనాల నేపథ్యంలో ఇతర పార్టీలు ఎన్ని కూటములు కట్టినా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఈ స్థితిలో నరేంద్ర మోడీకి అనుకూలంగా అన్నాడియంకె నేత జయలలిత సంకేతాలు ఇచ్చారు. జయలలిత మద్దతు ప్రకటిస్తే ఎన్డియె బలం 300 సీట్ల మైలురాయిని దాటుతుంది.












Click it and Unblock the Notifications