NDTV Poll Of Opinion Polls:మోడీ 400 కష్టమేనా? ఏపీలో మళ్లీ ఆయనే! తెలంగాణలో హస్తవాసి..!

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రజల నాడి తెలుసుకునేందుకు పలు సర్వే సంస్ధలు, జాతీయ, ప్రాంతీయ మీడియా ఛానళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ఇప్పటికే కొన్ని సంస్ధలు వివిధ సమయాల్లో చేసిన సర్వే ఫలితాలను కూడా వెల్లడించాయి. వీటిలో మెజార్టీ సర్వేలు కేంద్రంలో మోడీ సర్కార్ కే జై కొట్టేశాయి. అయితే మోడీ ఆశిస్తున్న 400 సీట్ల మార్కును దాటతారని ఏ ఒక్కరూ చెప్పడం లేదు.

ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్..

అలాగే ఏపీలో జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపైనా తమ అంచనాలు వెల్లడించాయి. ఇదే క్రమంలో ఇప్పుడు వివిధ సర్వేలను కలిపి రూపొందించిన ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. ఇందులో ఏబీపీ, జీ న్యూస్, ఇండియా టీవీ, టైమ్స్ వంటి ఛానళ్లు ఇచ్చిన సర్వేల్ని కలిపి ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ ఫలితాలను ఇవాళ వెల్లడించింది. ఇందులో మోడీ 400 సీట్ల టార్గెట్ చేరుకోవడం లేదని, అయితే 2019 కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారని తేలింది.

NDTV Poll Of Opinion Polls suggests pm modi s 400 goal impossible ys jagan re-elect ts bats cong

ఎన్డీయేకు 365 సీట్లు

ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 365 సీట్లు వస్తాయని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ వెల్లడించింది. 2019లో ఎన్డీయే కూటమికి 353 సీట్లు వచ్చాయి. ఇందులో బీజేపీ ఏకంగా 303 సీట్లు సాధించింది.ఈ లెక్కన చూస్తే ఈసారి గతం కంటే ఎన్డీయే 3.4 శాతం అదనంగా సీట్లు సాధిస్తున్నట్లు తేలింది. అలాగే బీజేపీకి 2014, 2019లో ప్రత్యర్ధిగా ఉన్నయూపీఏ వరుసగా 40, 60 సీట్లు సాధించగా.. ఈసారి ఇండియా కూటమిగా ఏర్పడిన తర్వాత 122 సీట్లు సాధించబోతున్నట్లు ఎన్టీటీవీ అంచనా వేస్తోంది. ఇది గతంతో పోలిస్తే ఏకంగా 35 శాతం అదనం.

ఇక్కడ ఎన్డీయే క్లీన్ స్వీప్ ?

ఈసారి ఎన్డీయే కూటమి మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ అంచనా వేసింది. ఇందులో ఢిల్లీతో పాటు గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, చంఢీఘడ్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 72 ఎంపీ సీట్లు ఉన్నాయి. అలాగే హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలుగా భావించే యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ లోనూ పట్టు కొనసాగిస్తుందని తేలింది. బెంగాల్, మహారాష్ట్రలో మాత్రం ముఖాముఖీ పోటీలు తప్పట్లేదు. దక్షిణాదిన నిరాశ తప్పేలా లేదు.

NDTV Poll Of Opinion Polls suggests pm modi s 400 goal impossible ys jagan re-elect ts bats cong

ఏపీలో మళ్లీ జగన్..

ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ ప్రకారం మరోసారి ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లలో వైసీపీకి 16 దక్కే అవకాశమున్నట్లు సర్వే తేల్చింది. ఈ ప్రభావం అసెంబ్లీ ఫలితాల్లోనూ ప్రతిబింబించబోతున్నట్లు తెలిపింది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ కు 9 సీట్లు, బీజేపీకి 4, బీఆర్ఎస్ కు 3, ఎంఐఎంకు ఒక్క సీట్లు వస్తాయని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+