ఉక్రెయిన్‌లో సుమారు 16వేల మంది భారతీయులు, రోడ్డు మార్గం ద్వారానే తరలింపు!
న్యూఢిల్లీ/కైవ్: ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దళాలు దాడులతో విరుచుకుపడుతున్న క్రమంలో ఆ దేశంలోని భారతీయులు, మనదేశంలోని వారి కుటుంబంసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమను ఎలాగైన ఇక్కడ్నుంచి స్వదేశానికి తీసుకెళ్లాలంటూ భారతీయ కుటుంబాలు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాయి. ఇప్పటికే వేలాది మందిని స్వదేశానికి తీసుకొచ్చిన భారత ప్రభుత్వం.. ఉక్రెయిన్ గగనతలంలో నిషేధం విధించడంతో భారత విమానాలు ఆగిపోయాయి.
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులకు మరో మార్గాన్ని ఎంచుకుంది. కైవ్ విమానాశ్రయం మూసివేత దృష్ట్యా ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తీసుకురావడం సవాలుగా మారినందున, భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ వి ష్రింగ్లా గురువారం కైవ్ రోడ్డు మార్గాల నుంచి భారతీయ పౌరులను ఖాళీ చేయడానికి మ్యాప్ అవుట్ చేసినట్లు తెలియజేశారు.

'మేము తరలింపును అత్యంత ముందుజాగ్రత్తతో నిర్వహిస్తాము. కైవ్ నుంచి భారతీయ పౌరులను ఖాళీ చేయడానికి, సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి రోడ్‌వేలు మ్యాప్ చేయబడ్డాయి" అని శ్రింగ్లా ANIకి చెప్పారు.
ఉద్రిక్తతపై భారతదేశ వైఖరి విషయంలో ష్రింగ్లా మాట్లాడుతూ.. "సిసిఎస్ సమావేశంలో, ఉక్రెయిన్‌లోని విద్యార్థులతో సహా భారతీయ పౌరుల భద్రత, భద్రతకు ప్రధాని మోడీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు".
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని మోడీ ఫోన్: కీలక సూచన, భారతీయుల భద్రతపై చర్చ
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన క్రమంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే రష్యా వైమానిక దళాలు ఉక్రెయిన్‌పై దాడులతో విరుచుకుపడుతున్నాయి. సుమారు వందమంది వరకు సైనికులు, సామాన్య ప్రజలు మరణించారు. పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు టెలిఫోన్‌లో మాట్లాడారు.
'ఉక్రెయిన్‌కు సంబంధించి ఇటీవలి పరిణామాల గురించి అధ్యక్షుడు పుతిన్ ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. రష్యా, నాటో మధ్య విభేదాలు నిజాయితీగా చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించబడతాయని తన దీర్ఘకాల నమ్మకాన్ని ప్రధాని పునరుద్ఘాటించారు' అని ప్రధానమంత్రి కార్యాలయం(PMO) వార్తా సంస్థ ఏఎన్ఐకి గురువారం రాత్రి తెలిపింది. ఉక్రెయిన్‌లో శాంతియుత పరిస్తితులు ఏర్పడేందుకు కృషి చేయాలని పుతిన్‌కు మోడీ సూచించారు.
ఉక్రెయిన్‌కు సంబంధించి ఇటీవలి పరిణామాలను అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోడీకి వివరించారు. ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులు, ముఖ్యంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి భారతదేశ ఆందోళనలపై కూడా ప్రధాని మోడీ చర్చించారు. భారతదేశం, వారి సురక్షిత నిష్క్రమణ, తిరిగి రావడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. కాగా, ప్రస్తుతం ఉక్రెయిన్ దేశంలో సుమారు 24వేల మంది భారతీయులు ఉన్నారు. వారి పరిస్థితిపై ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ సమీక్షిస్తోంది. బయటికి రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించింది. ఉక్రెయిన్ గగనతలంలో నిషేధం ఎత్తివేసినవెంటనే భారత్ తిరిగి తీసుకొస్తామని వారికి భరోసా ఇచ్చింది. అంతకుముందు, ప్రధాని మోడీ గురువారం భద్రతపై కేబినెట్ కమిటీ (సిసిఎస్) సమావేశానికి నాయకత్వం వహించారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు.












Click it and Unblock the Notifications