NEET 2021 : పరీక్ష తేదీని ప్రకటించిన ఎన్‌టీఏ... ఈసారి ఆఫ్‌లైన్ పద్దతిలో పెన్,పేపర్‌తో పరీక్ష...

మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎన్‌ఈఈటీ-నీట్‌)-2021 పరీక్షను ఆగస్టు 1వ తేదీన నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటించింది. ఈసారి ఆఫ్‌లైన్ పద్దతిలో పెన్,పేపర్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఒక్క ఏడాది మాత్రమే పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అధికారిక వెబ్‌సైట్ nta.ac.in ద్వారా ఈ వివరాలను వెల్లడించింది.

పరీక్షా సిలబస్,విద్యార్హతలు,వయసు,రిజర్వేషన్ తదితర వివరాలన్నీ త్వరలోనే ntaneet.nic.in వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపింది. మెడికల్,డెంటల్ కోర్సులతో పాటు బీఎస్ఎంఎస్,బీయూఎంఎస్,బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతీ ఏటా నీట్ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఏటా దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఇంగ్లీష్,హిందీలతో పాటు మొత్తం 11 భాషల్లో నీట్ పరీక్షను నిర్వహిస్తున్నారు.

 NEET 2021: Exam on August 1 in offline mode NTA releases official notice

కరోనా మహమ్మారి కారణంగా గతేడాది పలుమార్లు వాయిదాపడిన నీట్ పరీక్షను సెప్టెంబర్‌ 13న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 15,97,435 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగా...
13.66 లక్షల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఇందులో 7,71,500 మంది విద్యార్థులు అర్హత సాధించారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలతో గతేడాది నీట్ పరీక్షను నిర్వహించారు. అడ్మిట్ కార్డుతో పాటు హ్యాండ్ గ్లౌజ్, మాస్క్ తప్పని సరి చేశారు. అలాగే 50ఎంఎల్‌ శానిటైజర్‌, ట్రాన్స్‌పరెంట్‌ వాటర్‌ బాటిల్‌‌ను క్యారీ చేయాలన్న ఆదేశాలు జారీ చేశారు.విద్యార్థులకు పరీక్ష కేంద్రం ఎంట్రెన్స్‌ వద్దే టెంపరేచర్‌ పరీక్షలు నిర్వహించారు. లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక గదిలో పరీక్షకు అనుమతించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+