వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మత మార్పిళ్లపై లోక్‌సభలో వెంకయ్య... సంతృప్తి చెందని ములాయం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో మత మార్పిళ్ల సమస్యపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రకటన చేయాల్సిందేనని లోక్ సభలో ఈరోజు ప్రతిపక్షాలు పట్టుబడటంతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. ప్రభుత్వంగానీ, బీజేపీగానీ, మత మార్పిళ్లను ప్రోత్సహించదని స్పష్టం చేశారు.

ఒకవేళ ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మత మార్పిళ్లను ఆపే బాధ్యత ఆయా రాష్ట్రాలదేనని అన్నారు. ప్రస్తుతం దేశమంతా ప్రశాంతంగా ఉందని, కానీ కొంతమంది అసంతృప్తితో ఉండి ఆ విషయాన్ని రాజకీయ సమస్య చేయాలని చూస్తున్నారని అన్నారు.

విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. అయితే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాల సమయాన్ని యధాతథంగా కొనసాగించారు. ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమయిందంటూ ములాయం సింగ్‌ యాదవ్‌ విమర్శించారు.

ప్రశ్నోత్తరాల సమయం తర్వాత జీరో అవర్‌లో చర్చకు అవకాశం ఇస్తామని స్పీకర్‌ చెప్పినా ములాయం సింగ్‌ సంతృప్తి చెందలేదు. మరోవైపు ములాయం ఆరోపణలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. ప్రభుత్వం తమ వాగ్ధానాలను సమర్ధవంతంగా నిర్వహిస్తుందన్నారు.

ఇదే అంశంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో మరోసారి నిరసన చేపట్టారు. సభా కార్యక్రమాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మమతా బెనర్జీ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. నల్లధనం వ్యవహారంలో మోదీ సర్కార్‌ వైఖరిని తప్పుపట్టారు.

 మత మార్పిళ్లలో లోక్‌సభలో వెంకయ్య నాయుడు

మత మార్పిళ్లలో లోక్‌సభలో వెంకయ్య నాయుడు

దేశంలో మత మార్పిళ్ల సమస్యపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రకటన చేయాల్సిందేనని లోక్ సభలో ఈరోజు ప్రతిపక్షాలు పట్టుబడటంతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. ప్రభుత్వంగానీ, బీజేపీగానీ, మత మార్పిళ్లను ప్రోత్సహించదని స్పష్టం చేశారు.

 మత మార్పిళ్లలో లోక్‌సభలో వెంకయ్య నాయుడు

మత మార్పిళ్లలో లోక్‌సభలో వెంకయ్య నాయుడు

ఒకవేళ ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మత మార్పిళ్లను ఆపే బాధ్యత ఆయా రాష్ట్రాలదేనని అన్నారు. ప్రస్తుతం దేశమంతా ప్రశాంతంగా ఉందని, కానీ కొంతమంది అసంతృప్తితో ఉండి ఆ విషయాన్ని రాజకీయ సమస్య చేయాలని చూస్తున్నారని అన్నారు.

 మత మార్పిళ్లలో లోక్‌సభలో వెంకయ్య నాయుడు

మత మార్పిళ్లలో లోక్‌సభలో వెంకయ్య నాయుడు

విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. అయితే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాల సమయాన్ని యధాతథంగా కొనసాగించారు. ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమయిందంటూ ములాయం సింగ్‌ యాదవ్‌ విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత జీరో అవర్‌లో చర్చకు అవకాశం ఇస్తామని స్పీకర్‌ చెప్పినా ములాయం సింగ్‌ సంతృప్తి చెందలేదు.

 మత మార్పిళ్లలో లోక్‌సభలో వెంకయ్య నాయుడు

మత మార్పిళ్లలో లోక్‌సభలో వెంకయ్య నాయుడు

ఇదే అంశంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో మరోసారి నిరసన చేపట్టారు. సభా కార్యక్రమాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మమతా బెనర్జీ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. నల్లధనం వ్యవహారంలో మోదీ సర్కార్‌ వైఖరిని తప్పుపట్టారు.

మత మార్పిడి

మత మార్పిడి

అంశంపై సోమవారం రాజ్యసభలో వివాదం మొదలైంది. జేడీయూ ఎంపీ శరద్‌యాదవ్‌ మతమార్పిడుల వ్యవహారాన్ని ప్రస్తావించడంతో గందరగోళం చెలరేగింది. పునరాగమనం పేరిట దేశంలో బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయని, వాటివల్ల దేశంలో లౌకికవాదం దెబ్బతింటుందని ఆయన మండిపడ్డారు.

 ఆ అంశంపై జీరో

ఆ అంశంపై జీరో

అవర్‌లో చర్చిద్దామని డిప్యూటీ ఛైర్మన్‌ చెప్పినా ప్రతిపక్షాలు పట్టించుకోలేదు. నల్లధనం వెనక్కి తెచ్చే అంశం, మతఘర్షణలు జరగకుండా నిలువరించే అంశంపై ప్రధాని నరేంద్రమోదీ భారీ వాగ్ధానాలు చేశారని సీతారాం ఏచూరి అన్నారు. ఆ అంశాలపై చర్చకు పట్టుపట్టారు.

 అయితే నల్లధనం

అయితే నల్లధనం

అంశంపై చర్చ ఇప్పటికే జరిగిపోయినందున ప్రతిపక్షాలు చేపట్టిన తీర్మానమే తప్పని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. సభా కార్యక్రమాలను సస్పెండ్‌ చేసి మతమార్పిడుల అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని డి. రాజా డిమాండ్‌ చేశారు.

మత మార్పిళ్లపై లోక్‌సభలో వెంకయ్య... సంతృప్తి చెందని ములాయం

మత మార్పిళ్లపై లోక్‌సభలో వెంకయ్య... సంతృప్తి చెందని ములాయం


సభకు రావడానికి ప్రధానికి 56 అంగుళాల ఛాతి అక్కరలేదని, 4 అంగుళాల హృదయం ఉంటే చాలునని తృణమూల్‌ ఎంపీ ఓబ్రేన్‌ చమత్కరించారు. అయినా విపక్షాల డిమాండ్లకు సభాపతి తలొగ్గలేదు.

విపక్షాల సభ్యులు

విపక్షాల సభ్యులు


దీంతో విపక్షాల సభ్యులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ పొడియం వద్దకు దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో సభను మళ్లీ వాయిదా పడింది.

English summary
Facing opposition attack over the conversion issue, Government today said in Lok Sabha that neither it nor the BJP was involved in such acts and the state governments should take action if anyone violates the law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X