వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేక్‌ ఎవరెస్ట్‌ అవరోహణ- నకిలీ ఫ్రూఫ్‌ సమర్ఫించిన ఇద్దరు భారతీయులు- 2016 ఘటనపై నేపాల్ దర్యాప్తు

|
Google Oneindia TeluguNews

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతాల్లో ఒకటైన ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు దేశవిదేశీయులు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన పర్వతారోహకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. ఇలా ఎవరెస్ట్‌ పర్వతారోహణ చేసిన వారు అందుకు సంబంధించిన ఆధారాలను నేపాల్‌ ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. వాటిని పరీక్షించి నేపాల్‌ సర్కార్‌ వారికి ఎవరెస్ట్‌ను అధిరోహించినట్లు ధృవీకరణ పత్రాలు జారీ చేస్తుంది. ఇదే కోవలో 2016లోనూ ఓ 15మంది అంతర్జాతీయ పర్వతారోహకుల బృందం ఎవరెస్ట్‌ను ఎక్కినట్లు ఆధారాలు ఇచ్చింది. అందులో ఇద్దరు భారతీయులు మాత్రం నకిలీ ఆధారాలు సమర్పించినట్లు తేలింది.

 ఎవరెస్ట్‌ పర్వతారోహణ ఛాలెంజ్‌

ఎవరెస్ట్‌ పర్వతారోహణ ఛాలెంజ్‌

భారత్‌-నేపాల్‌-చైనా సరిహద్దుల్లో ఉన్న హిమాలయ పర్వతాల్లో ఎవరెస్ట్‌ శిఖరం అత్యంత ఎత్తయినది. అత్యంత సవాళ్లతో కూడిన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించే వారికి అంతర్జాతీయంగా ఓ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. దీన్ని దాదాపు అన్ని దేశాలూ గుర్తిస్తాయి. భారత్‌లోనూ గతంలో చాలా మంది ఎవరెస్ట్‌ను అధిరోహించిన గుర్తింపు సాధించారు. అయితే ఎవరెస్ట్‌ ఎక్కిన వారికి గుర్తింపు ఇవ్వడం అనేది నేపాల్‌ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఎవరెస్ట్‌ ఎక్కిన వారు అందుకు సంబంధించిన ఆధారాలను నేపాల్‌ ప్రభుత్వానికి సమర్పిస్తే వాటిని అన్ని విధాలుగా పరిశీలించి అక్కడి ప్రభుత్వం గుర్తింపు పత్రం ఇస్తుంది.

 2016లో ఎవరెస్ట్ యాత్ర

2016లో ఎవరెస్ట్ యాత్ర

2016లో ఇదే కోవలో ఓ అంతర్జాతీయ పర్వతారోహకుల బృందం ఎవరెస్ట్‌ను అధిరోహించినట్లు ప్రకటించుకుంది. 15మందితో కూడిన ఈ బృందంలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. వీరంతా తమ ఎవరెస్ట్‌ అధిరోహణకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఆధారాలను నేపాల్‌ ప్రభుత్వానికి సమర్పించారు. వీటిని వివిధ కోణాల్లో పరిశీలించిన నేపాల్‌ సర్కారు తాజాగా అందులో అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించింది. దీనికి సంబంధించిన వివరాలను తాజాగా బయటపెట్టింది.

 ఇద్దరు భారతీయుల ఫేక్‌ అవరోహణ

ఇద్దరు భారతీయుల ఫేక్‌ అవరోహణ

2016లో ఎవరెస్ట్‌ అధిరోహించినట్లు తమకు అందిన ఆధారాలను పరిశీలించిన నేపాల్‌ ప్రభుత్వం ఇద్దరు భారతీయులు నరేంద్ర సింగ్ యాదవ్‌, సీమా రాణీ గోస్వామి ఇద్దరూ తాము ఎవరెస్ట్‌ ఎక్కకపోయినా ఎక్కినట్లు నకిలీ ఆధారాలు సమర్పించినట్లు గుర్తించింది. దీంతో రెండు నెలల క్రితం దీనిపై విచారణ జరిపేందుకు ఓ దర్యాప్తు కమిటీని నేపాల్‌ సర్కారు నియమించింది. ఈ నివేదిక త్వరలో ప్రభుత్వానికి అందనుంది. ఆ తర్వాత వీరిపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నది నేపాల్‌ సర్కారు తేల్చబోతోంది. ఓ స్ధానిక నేపాల్ వార్తాపత్రిక మాత్రం ఈ ఇద్దరినీ పదేళ్ల పాటు ఎవరెస్ట్‌ అధిరోహించకుండా నిషేధం విధించడంతో పాటు గతంలో ఇచ్చిన లైసెన్స్‌లను కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది.

 ఫేక్‌ ఎవరెస్ట్‌ యాత్ర తెలియదన్న భారత్

ఫేక్‌ ఎవరెస్ట్‌ యాత్ర తెలియదన్న భారత్

భారత్‌కు చెందిన ఇద్దరు పర్వతారోహకులు నరేంద్ర సింగ్‌ యాదవ్, సీమా రాణీ గోస్వామిపై నేపాల్ ప్రభుత్వం విచారణ జరుపుతున్న విషయం తమకు తెలియదని భారత్‌ తెలిపింది. ఫేక్‌ ఎవరెస్ట్ యాత్రపై తమకు ఎలాంటి సమాచారం లేదని భారత పర్వతారోహణ ఫౌండేషన్‌ కార్యదర్శి కల్నల్‌ ఎస్‌.పి.మాలిక్‌ పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పర్వతారోహకులు ఇద్దరూ కూడా తమకు దీనిపై ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

English summary
Authorities in Nepal are investigating the case of two Indian mountaineers who allegedly faked their Mount Everest summit in 2016. The duo — Narender Singh Yadav and Seema Rani Goswami were part of a 15-member international team managed by the Seven Summit Treks in Nepal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X