వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సతుల పోరు: డింపుల్ నోటి నుంచి ముత్యాలే...

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమాజ్ వాదీ పార్టీలో ఇద్దరు మహిళా నేతలు ప్రముఖంగా వార్తల్లో ఉంటున్నారు. వారిద్దరూ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోడళ్లే కావడం విశేషం.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమాజ్ వాదీ పార్టీలో ఇద్దరు మహిళా నేతలు ప్రముఖంగా వార్తల్లో ఉంటున్నారు. వారిద్దరూ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోడళ్లే కావడం విశేషం. ప్రస్తుతం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ములాయం పెద్ద కుమారుడు యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ వారిలో ఒకరైతే మరొకరు చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ సతీమణి అపర్ణా యాదవ్.

వారిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన భిన్న ద్రువాలు. పెద్ద కోడలు డింపుల్ యాదవ్.. తన భర్త అఖిలేశ్ యాదవ్‌తో కలిసి కూర్చోవడం తప్ప.. మిగతా సమయంలో తెర వెనుకే వ్యవహరిస్తుంటారు. 2012లో కన్నౌజ్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందినప్పటి నుంచి డింపుల్ యాదవ్.. మ్రుధు స్వభావిగా పేరు తెచ్చుకున్నారు.

మౌనంగా వ్యవహరించే డింపుల్ తన భర్తకు అవసరమైన రాజకీయ వ్యూహ రచనలో తలమునకలవుతుంటారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రిగా అఖిలేశ్ యాదవ్ కు అవసరమైన ప్రసంగాలు రాసి పెట్టడంతోపాటు వ్యూహాలు, ఎత్తుగడల రూపకల్పనకే పరిమితం అవుతారని చెప్తారు. వివాదాలకు దూరంగా ఉంటూ భర్తకు వెన్నంటే ఉండటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

 కుండ బద్దలు కొట్టడమే అపర్ణ తీరు..

కుండ బద్దలు కొట్టడమే అపర్ణ తీరు..

కానీ అపర్ణా యాదవ్ అందుకు విరుద్ధం. ఆమె రాజకీయ లక్ష్యాలు సుస్పష్టం. రాజకీయంగా ఎదగాలన్న ఆకాంక్షలను స్పష్టంగానే బయటపెడతారు. అనునిత్యం వివాదాస్పదవ్యాఖ్యలు చేసినా, స్వచ్ఛ భారత్ అభియాన్ పై ప్రధాని నరేంద్రమోడీని ప్రశంసించేందుకు వెనుకాడకపోయినా, కులాల కంటే ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలన్నడిమాండ్ చేయడంలోనూ అపర్ణా యాదవ్ వెనుకాడరు. తన లక్ష్యాలతో యాంబియస్‌గా వ్యవహరిస్తారు. తన మనస్సులో భావాలను బయటపెడతారు. బాలురు అన్నాక పొరపాట్లు చేస్తారన్న తన మామ ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యలతో విభేదించానికి ఆమె వెనుకాడలేదు.

వారిద్దరూ అక్కడి ఆడపడుచులే...

వారిద్దరూ అక్కడి ఆడపడుచులే...

ఇటీవల అధికార సమాజ్ వాదీ పార్టీకి నాయకత్వం వహించిన యాదవ్ కుటుంబంలో ఆధిపత్య పోరుకు నేపథ్యంగా మారిన కోడళ్లలో సారూప్యతలు ఉన్నాయి. ములాయం సింగ్ భార్య సాధనాగుప్తా, ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఎస్పీ వ్యవస్థాపక అధినేత కోడలు అపర్ణ మధ్య రెండు సారూప్యతలు ఉన్నాయి. అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, సాధనాగుప్తా తనయుడు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా యాదవ్ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆడబడుచులే కావడం యాద్రుచిక్కం. అపర్ణాయాదవ్‌కు డింపుల్ యాదవ్ ఆదర్శంగా నిలిచారని చెప్పొచ్చు. అపర్ణయాదవ్ పట్ల డింపుల్ యాదవ్ దయచూపేవారు. ప్రత్యేకించి ఆమె దుస్తుల పట్ల శ్రద్ధ వహించేవారు. టీవీ చానెళ్లలో పార్టీ ఆదిపత్య పోరు ముందుకు వచ్చినా కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలోపేతం చేయడంలో వారిద్దరూ ప్రత్యేకించి డింపుల్ యాదవ్ కీలక పాత్ర పోషించారు.

సితార్ గంజ్‌లో సమరం సతులదే

సితార్ గంజ్‌లో సమరం సతులదే

ఉత్తరాఖండ్ రాష్ట్రం సితార్‌గంజ్ అసెంబ్లీ స్థానంలో ఆసక్తికరమైన ఎన్నికల సంగ్రామం జరుగుతున్నది. ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మరో స్వతంత్ర అభ్యర్థి తమ భర్త ఒక్కరేనని చెప్పడమే వింతగా ఉన్నది. ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (యూపీసీసీ) మాజీ సభ్యుడు శ్యామ్ ప్రసాద్ బిశ్వాస్.. భార్య మాల్టీ బిశ్వాస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆమెపై పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి బిందా బిశ్వాస్ సైతం తన భర్త శ్యామ్ బిశ్వాస్ అని అఫిడవిట్‌లో పేర్కొనడం గమనార్హం. బిందా బిశ్వాస్ తన ఆస్తులు కేవలం రూ.48,690 అని పేర్కొంటే మాల్టీ బిశ్వాస్ మాత్రం రూ.6.93 లక్షలని నమోదు చేశారు. ఒక ఫార్చూనర్ కారు, స్కార్పియో ఎస్‌యూవీ కూడా ఉన్నాయని పేర్కొన్నారు. బీడీల తయారీదారు శ్యామ్ బిశ్వాస్ బెంగాలీ. ఈ నియోజకవర్గంలో 30 శాతం బెంగాలీలే ఉంటారు.

ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసమే...

ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసమే...

తన అసలుసిసలు భార్య మాల్టీ అని స్పష్టం చేశారు. ఇక బిందా బిశ్వాస్ గురించి చెప్పాలంటే రామయణం అవుతుందని దాటవేశారు. కానీ తన భర్తను దక్కించుకునేందుకే స్వతంత్ర అభ్యర్థిగా బిందా బిశ్వాస్ పోటీలో ఉన్నట్లు చెప్పారు.1976లో తనను వివాహం చేసుకున్నారని తెలిపారు. ఓ కేసులో పారిపోయి వచ్చారని బిందా ఆరోపించారు. తమ కుటుంబం డబ్బు సాయం చేయడంతో బీడీ తయారీదారుగా ఎదిగాడని కూడా తెలిపారు. కానీ డబ్బు సంపాదన పెరిగిన తర్వాత ఆయన ఆలోచనలు మారిపోయాయని బిందా చెప్పారు. కోల్‌కతాలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లినప్పుడు మాల్టీతో శ్యామ్ ప్రసాద్ బిశ్వాస్ కలిసి ఉండటం మొదలు పెట్టాడని తెలిపారు. పుట్టింటి నుంచి తిరిగొచ్చిన తనను బయటకు గెంటేశాడని ఆరోపించారు. సమాజంలో తన స్థానం కోసం పోరాడుతానని బిందా స్పష్టం చేశారు.

మాజీ సిఎం బహుగుణ తనయుడు..

మాజీ సిఎం బహుగుణ తనయుడు..

ఈ స్థానం నుంచి బిజెపి తరఫున మాజీ సీఎం విజయ్ బహుగుణ కుమారుడు సౌరవ్ బహుగుణ పోటీ పడుతున్నారు. గతేడాది ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మాజీ సీఎం విజయ్ బహుగుణ బిజెపిలో చేరారు. తాను ప్రస్తుతానికి తప్పుకుని తన కుమారుడు సౌరబ్ బహుగుణకు బిజెపి టిక్కెట్ ఇప్పించారు. గమ్మత్తేమిటంటే బీజేపీ నుంచి సీఎం కావాలని ఆకాంక్షిస్తున్న నేతల్లో విజయ్ బహుగుణ కూడా ఒకరు.

English summary
Dimple Yadav rarely, if ever, makes public appearances alone. In Parliament, she is flanked by brothers-in-law Dharmendra and Tej Pratap, or by father-in-law Mulayam Singh Yadav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X