నేతాజీని జాతి నేతగా గుర్తించాలి: మమత బెనర్జీ
కోల్‌కతా: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను జాతి నాయకుడిగా గుర్తించాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతాజీకి సంబంధించిన రహస్య దస్త్రాలను బహిర్గతం చేసిన అనంతరం మమత ఈ ప్రకటన చేశారు.
సుభాష్ చంద్రబోస్‌కు జాతి నాయకుడి గౌరవానికి అన్నివిధాల అర్హులు అని ఆమె ట్వీట్ చేశారు. మోడీ విడుదల చేసిన దస్త్రాల ద్వారా నేతాజీ చివరి రోజులకు సంబంధించిన వాస్తవాలు వెలుగుచూస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

భావితరాలకు ఆయన గురించి నిజాలను అందించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. కాగా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే నేతాజీకి సంబంధించిన 64 రహస్య పత్రాలు బహిర్గతం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications