చిన్ననాడే ఫ్యామిలీని వదిలాడు: ప్రధాని సోదరుడు, మోడీతో నేతాజీ ఫ్యామిలీ

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన ఆయన సోదరుడు ప్రహ్లాద్ మోడీ ప్రశంసలు కురిపించారు. మంగళవారం నాడు ప్రహ్లాద్ మోడీ హైదరాబాదుకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు. చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలి వెళ్లిన మోడీ దేశాన్ని కుటుంబంగా భావిస్తున్నారన్నారు. రేషన్ డీలర్ల సమస్యను తాను మోడీ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు.

నేతాజీ మనవడితో మోడీ భేటీ

సుభాశ్‌ చంద్రబోస్‌ మునిమనవడు సూర్య కుమార్‌ బోస్‌తో ప్రధాని మోడీ మంగళవారం సమావేశమయ్యారు. ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న మోడీ బెర్లిన్‌లో బోస్‌, అక్కడి భారతీయులతో సమావేశమై పలు అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

 Netaji's kin meets Modi; says family doesn't believe plane crash theory

వచ్చే సెప్టెంబరులో ఫ్రాన్స్‌లో జరగబోయే క్త్లెమేటిక్‌ ఛేంజ్‌ కాన్ఫరెన్స్‌కు అజెండా రూపొందిస్తామని, గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి అభివృద్ధి చెందిన దేశాలు భారత్‌ను ప్రశ్నిస్తున్నాయని, అయితే తలసరిగా చూస్తే తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశం భారత్ అన్నారు. భారతీయ సంస్కృతే దేశంలోని ప్రకృతికి రక్షగా నిలుస్తుంది. ప్రకృతిని దైవ సమానంగా భావించే దేశం ప్రపంచం మొత్తం మీద భారత్‌ ఒకటే అన్నారు.

ఈ సందర్భంగా నేతాజీ కుటుంబ సభ్యులతో మోడీ భేటీ అయ్యారు. నేతాజీ ప్లేన్ క్రాష్‌లో చనిపోయారని చెప్పడాన్ని తాము నమ్మలేకపోతున్నామని ఆయన కుటుంబ సభ్యులు మోడీతో చెప్పారు. నేతాజీ దేశాన్ని తన కుటుంబంగా భావించారన్నారు. కాబట్టి, నేతాజీ మృతిపై తాము ఒక్కరమే లేవనెత్తడం కాకుండా, జాతి కూడా ప్రశ్నించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+