వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్థరాత్రి బైక్ తో టెక్కీ,రక్షించిన ఎ ఎస్ ఐ, నెటిజన్లు ఇలా..

బైక్ లో పెట్రోల్ అయిపోయి అర్థరాత్రి నిర్మానుష్యప్రదేశంలో భర్త కోసం ఎదురుచూస్తోన్న ఓ టెక్కీని ట్రాఫిక్ ఎఎస్ ఐ సహయం చేశాడు ఈ ఘటనపై టెక్కీ ఫేస్ బుక్ లోపోస్టు చేసింది. దీంతో నెటిజన్లు పోలీసుపై ప్రశంసలు కు

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు:పోలీసులంటే అందరూ ఒకేలా ఉండరు. ఆపదలో ఉన్నవారికి సహయపడే మనసున్నవారు కూడ ఈ శాఖలో ఉంటారని నిరూపించాడు ఓ పోలీసు. బెంగుళూరులో జరిగిన ఘటనలో ట్రాఫిక్ ఎ.ఎస్ .ఐ ఓ టెక్కీకి సహయపడి పలువురి ప్రశంసలు పొందాడు.

బెంగుళూరులోని పనిచేసే నిర్మలా రాజేష్ అనే సాప్ట్ వేర్ ఇంజనీర్ రాత్రి పూట తన విధులను ముగించుకొని ఇంటికి తన బైక్ పై వస్తోంది.

ఆమె బైక్ మహలక్ష్మి లేఔట్ కు చెందిన నిర్మలా రాజేష్ సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తోంది. ఆమె జిసి నగర్ లోని టివి టవర్ వద్దకు చేరుకోగానే ఆమె బైక్ లో పెట్రోలో అయిపోయింది.

netizens appreciated on traffic asi narayanaswamy

దీంతో ఆమె తన భర్తకు పోన్ చేసింది. పెట్రోల్ తీసుకువస్తానని ఆయన ఆమెకు చెప్పాడు. భర్త కోసం ఆమె ఎదురుచూస్తోంది.ఆమె బైక్ ఆగిపోయిన ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉంది.

అయితే అదే సమయంలో కాడుగొండనహళ్ళి ఎఎస్ఐ నారాయణ స్వామి నిర్మానుష్య ప్రదేశంలో బైక్ తో సహ నిలబడి ఉన్న నిర్మలా రాజేష్ ను విచారించాడు.

వెంటను ఆమెకు తన బైక్ ను ఇచ్చి ఈ ఆమెను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మెక్రీ సర్కిల్ వద్ద ఉండాలని కోరారు.
మెక్రీ సర్కిల్ వద్దకు ఆమె బైక్ ను ఆయన నెట్టుకొంటూ తీసుకువచ్చాడు.

అదే సమయానికి నిర్మలా రాజేష్ భర్త పెట్రోల్ తీసుకొని మెక్రీ సర్కిల్ కు చేరుకొన్నాడు. ట్రాఫిక్ ఎఎస్ఐ నారాయణస్వామి చేసిన సహయానికి ఆ భార్య, భర్తలిద్దరూ కూడ ధన్యవాదాలు తెలిపారు.

అర్థరాత్రిపూట ట్రాఫిక్ ఎఎస్ఐ చేసిన సహయం గురించి ఆమె ఫేస్ బుక్ లోపోస్టుచేసింది.పోలీసులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. నెటిజన్లు ఎఎస్ఐ నారాయణస్వామిని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఘటనతో హొంమంత్రి పరమేశ్వర్ నారాయణస్వామికి 15 వేల రూపాయాల నగదును అందించారు.

English summary
netizens appreciated on traffic asi narayanaswamy .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X