వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు రోజుల్లో కొత్త 500 నోట్లు వచ్చేస్తున్నాయి

By Narsimha
|
Google Oneindia TeluguNews

నాసిక్ :పెద్ద నగదు నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు శుభవార్త. రెండ రోజుల్లో కొత్త నగదు నోట్లు మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. కొత్త రెండువేల రూపాయాల నోటు అందుబాటులోకి వచ్చింది. రద్దైన ఐదువందల నోటు స్థానంలో కొత్త నోటును రెండు రోజుల్లో బ్యాంకులకు రానున్నాయి.

పెద్ద నగదు నోట్ల రద్దుతో దేశ వ్యాప్తగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నగదు రద్దు చేసి ఐదు రోజులు అవుతోంది. ఇంకా చిల్లర నగదు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం లేదు. ఈ కారణంగా రద్దు చేసిన ఐదువందల నగదు నోటు స్థానంలో కొత్త నోట్లను వెంటనే మార్కెట్ లోకి తీసుకురానున్నారు.

new 5oo rupees of currency within twodays in banks

ఐదువందల కొత్త కరెన్సీ ప్రింటింగ్ పూర్తైంది. ఈ నోట్లను బ్యాంకులకు పంపుతున్నారు. రెండు రోజుల్లో దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు కొత్త ఐదువందల నోట్లు అందుబాటులోకి రానున్నాయి.ఇప్పటికే 50లక్షల నోట్లను బ్యాంకులకు పంపింది. వీటి విలువ సుమారు 250 కోట్లుగా అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల్లో ఈ కరెన్సీ బ్యాంకులకు చేరనున్నాయి.

దేశంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు చెందిన ముద్రణాలయాలు 9 ఉన్నాయి. వీటిలోనే నగదు, నాణెలు తయారు అవుతాయి. కర్ణాటకలోని మైసూర్, పశ్చిమబంగాలోని సల్బోని ప్రింటింగ్ ప్రెస్ లలో రెండు వేలు,.ఐదువందల నోట్లను ముద్రించారు. నాసిక్, మద్యప్రదేశ్ లలోని దేవాస్ లో ప్రస్తుతం ఐదువందల నోట్లను ముద్రిస్తున్నారు.ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి 40 కోట్ల విలువైన ఐదువందల నోట్లను ముద్రించనున్నార. రెండు వారాల క్రితమే ఈ నగదు ముద్రణ ప్రారంభమైంది. బుదవారం నాటికి మరో 50 లక్షల విలువైన ఐదు వందల రూపాయాల నగదును పంపనున్నారు.20 రూపాయాలు, 50 రూపాయాలు, వంద రూపాయాల విలువైన నగదును కూడ ముద్రిస్తున్నారు.

English summary
New five hundred rupees come to banks within two days.this month of 8th central government banned currency.new 2000 rupees currency in market, now 500 rupees currency come to banks within two days.250 crores worth of 500 rupees of currency receive banks in two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X