అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ సీటింగ్ ఏదైతే ఉందో..!!

Amrit Bharat Express: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల దూకుడు కొనసాగుతోంది. సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పలు రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.

సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

New Amrit Bharat Express hits the tracks in run this route

అదే సమయంలో కొత్తగా అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో కొత్తగా ప్రవేశపెట్టనున్న అమృత్ అమృత భారత్ రైళ్ల జాబితాను రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అయిదు రూట్లల్లో ఈ కొత్త ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

గయా- ఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, వైశాలి- కోడెర్మా (బుద్ధిస్ట్ సర్క్యూట్ ట్రైన్‌) ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. గయాలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ మహ్మద్ ఆరిఫ్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.

గయా నుండి బయలుదేరే ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. సుబేదార్, గోవింద్ పురి, టూండ్లా మీదుగా రాకపోకలు సాగిస్తుంది. దీనితో పాటు- ఛాప్రా- ఢిల్లీ, ముజఫర్‌పూర్- హైదరాబాద్‌, సహర్సా- అమృత్‌సర్‌, పాట్నా- పూర్నియా (వందే భారత్ ఎక్స్‌ప్రెస్)లను ప్రధాని మోదీ త్వరలో ప్రారంభించనున్నారు.

కాగా- ఈ రైలు ఇంటీరియర్ అద్దిరిపోయింది. సాధారణ రైళ్ల కంటే పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఇతర రైళ్లల్లో సీట్ల కవర్లు నీలం రంగులో ఉంటే ఈ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ లో లేత కాషాయం, బూడిదరంగులో మెరిసిపోతుండటం విశేషం. గ్యాంగ్ వే కూడా కాస్త విశాలంగా రూపుదిద్దుకున్నాయి. సౌకర్యవంతంగా అనిపిస్తోన్నాయి. అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ అవుటర్ కలర్ నే ఇంటీరియర్ లోనూ వినియోగించారు. ఇతర రైళ్లతో పోల్చుకుంటే కిటికీలు కూడా కాస్త పెద్దవే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+