100 అటల్ క్యాంటీన్లకు రిబ్బన్ కట్.. ఇక డిజిటల్ టోకెన్లు

నేడు- మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయన శత జయంతి ఉత్సవాలను జరుపుకొంటోన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. శతాబ్ది ఉత్సవాలు ముగింపు కావడం వల్ల పలు సామాజిక పథకాలకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 100 అటల్ క్యాంటీన్లను ప్రారంభించింది. అన్న క్యాంటీన్ల తరహాలో అయిదు రూపాయలకే భోజనం లభిస్తుందిక్కడ.

లజ్ పత్ నగర్ లో ఏర్పాటు చేసిన అటల్ క్యాంటీన్ ను ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రారంభించారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆశిష్ సూద్ సహా పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు. ప్రతి అటల్ క్యాంటీన్ లో రోజుకు రెండు పూటలా భోజనాన్ని వడ్డిస్తారు. మెనూలో అన్నం, పప్పు, రోటీ, కూరగాయలు వంటివి ఉన్నాయి. ఒక్కో క్యాంటీన్ రోజుకు దాదాపు 1,000 మందికి ఆహారాన్ని అందించేలా అందుబాటులోకి తీసుకొచ్చారు.

New Atal Canteens to Offer Rs 5 Meals on Vajpayee Birth Anniversary

అటల్ క్యాంటీన్లను ప్రారంభించిన అనంతరం రేఖా గుప్తా మాట్లాడారు. రోజువారీ కూలీలు, కార్మికులు, తక్కువ ఆదాయ వర్గాల కుటుంబాలకు అండగా నిలుస్తాయని, అయిదు రూపాయలకే నాణ్యమైన భోజనం లభించేలా వీటిని రూపొందించామని అన్నారు. అటల్ క్యాంటీన్ ఢిల్లీ ఆత్మగా మారుతాయని వ్యాఖ్యానించారు. ఎవరూ ఆకలితో పడుకోవాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ సమగ్ర సంక్షేమ నిబద్ధతకు ఈ క్యాంటీన్లు అద్దం పట్టాయని అన్నారు.

నగరం అన్ని రకాలుగా డెవలప్ కావడానికి నిత్యం కష్టపడే కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే ఓ చిరు కానుకగా ఆమె అభివర్ణించారు. భోజనాలు పక్కదారి పట్టకుండా ఉండటానికి, ఇందులో పారదర్శకతను పెంచడానికి, భోజనాల పంపిణీ మాన్యువల్ కూపన్‌ల బదులు డిజిటల్ టోకెన్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. అంతేకాకుండా- దశలవారీగా అన్ని క్యాంటీన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు డిజిటల్ ప్లాట్‌ఫామ్ రియల్ టైమ్ ద్వారా వీటిని పర్యవేక్షిస్తుంది.

ఎల్పీజీ స్టవ్‌, ఆర్ఓ మంచినీరు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు.. ఈ క్యాంటీన్లల్లో అందుబాటులో ఉన్నాయి. FSSAI, NABL గుర్తింపు పొందిన లాబొరేటరీలల ద్వారా క్రమం తప్పకుండా ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షిస్తారు. పరిశుభ్రత ప్రమాణాలు, సిబ్బంది ఆరోగ్యం, మొత్తం భద్రతా నిబంధనలను వివరిస్తూ నెలవారీ సమగ్ర నివేదికలను ప్రతి క్యాంటీన్ ఆపరేటర్ సమర్పించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+