తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ

మనం రోజూ తినే కోడి గుడ్డు ఎంత పాతది? కోడి అది ఎప్పుడు పెట్టింది? ఎప్పుడు పాడైపోతుంది? ఇప్పటివరకు వీటికి సమాధానం కేవలం పౌల్ట్రీ యజమానులకే తెలుసు. కానీ, ఇకపై ప్రతి సామాన్య వినియోగదారుడు గుడ్డు తాజాదనాన్ని చూసి మరీ కొనుగోలు చేయవచ్చు. ప్రభుత్వం నేటి నుంచి గుడ్ల విక్రయాలపై అత్యంత కఠినమైన, పారదర్శకమైన ఆహార భద్రతా నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. దేశంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా రికార్డు సృష్టించిన స్టేట్ ఏంటో తెలుసా?.

కొత్త నిబంధనల ప్రకారం, విక్రయించే ప్రతి గుడ్డుపై అది పెట్టిన తేదీ (Production Date) గడువు తేదీ (Expiry Date) తప్పనిసరిగా ముద్రించి ఉండాలి. ఇకపై హోల్‌సేల్ మార్కెట్లు, కిరాణా దుకాణాలు లేదా రిటైల్ సెంటర్లలో డేట్ మార్కింగ్ లేని గుడ్లను విక్రయిస్తే వాటిని 'వినియోగానికి అనర్హమైనవి'గా గుర్తించి అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేస్తారు. వినియోగదారుల ఆరోగ్యానికి రక్షణ కల్పించడంతో పాటు, సరఫరా గొలుసులో పారదర్శకత పెంచడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.

New Egg Marking Rules in UP Pink and Blue Ink Stamps to Indicate Freshness and Storage Type for Consumers

పింక్ vs బ్లూ: రంగును బట్టి తాజాదనం!

ఈ నిబంధనల అమలులో అధికారులు ఒక ఆసక్తికరమైన పద్ధతిని ప్రవేశపెట్టారు. సాధారణ గాలి ఉష్ణోగ్రత (30°C) వద్ద నిల్వ చేసే గుడ్లపై 'పింక్' రంగు ఇంక్‌తో తేదీలను ముద్రించాలి. వీటిని రెండు వారాల లోపు వినియోగించాలి. అదే కోల్డ్ స్టోరేజ్‌లో (2 నుండి 8°C) నిల్వ చేసే గుడ్లకైతే 'బ్లూ' రంగు ఇంక్‌ను వాడాలి. ఈ గుడ్లు ఐదు వారాల వరకు తాజాగా ఉంటాయి. ఫుడ్-గ్రేడ్ ఇంక్‌తో వేసే ఈ స్టాంపులు వినియోగదారులకు ఏ రకమైన హాని కలిగించవు.

ఉల్లంఘిస్తే జరిమానాల వేట!

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి ముఖేష్ మెష్రామ్ తెలిపిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి.. ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించనున్నారు. నిబంధనలు పాటించని పౌల్ట్రీ ఫారాలు, సరఫరాదారులపై భారీ జరిమానాలు విధిస్తారు. ప్రస్తుతం దేశంలో ఏటా 138 బిలియన్లకు పైగా గుడ్లు ఉత్పత్తి అవుతుండగా, అందులో ప్రధాన వాటా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలదే ఉంది. యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం త్వరలోనే ఇతర రాష్ట్రాల్లో కూడా అమలులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ముఖ్యంగా ఫిట్‌నెస్ ప్రేమికులు, ప్రోటీన్ డైట్ తీసుకునేవారు ఎక్కువగా ఉండే నోయిడా, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. ఇకపై కుళ్ళిన లేదా పాత గుడ్లు కొనే ప్రమాదం ఉండదని వినియోగదారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+