Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రైవసీ హక్కులను గౌరవిస్తాం -సోషల్ మీడియా కట్టడికే ఐటీలో కొత్త రూల్స్ -కేంద్రం వివరణ

అధికార బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు నానాటికీ తీవ్రతరం అవుతుండగా, ఆయా సోషల్ మీడియా సంస్థలపై పట్టుబిగించేలా కేంద్రం కొత్త నిబంధనలు తేవడం వివాదాస్పదమైంది. కొత్త ఐటీ చట్టాలతో యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లుతుందని వాట్సాప్ సంస్థ ఏకంగా న్యాయపోరాటానికి దిగగా, కొత్త రూల్స్ వల్ల భారత్ లో భావప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ట్విటర్ సంస్థ ఆరోపించింది. ఈ క్రమంలో కేంద్రం కీలక వివరణ ఇచ్చుకుంది..

ప్రైవసీ హక్కులను కేంద్రం గౌరవిస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త రూల్స్ విషయంలో సాధారణ వాట్సాప్ యూజర్లు భయపడాల్సిన పని లేదని మైక్రోబ్లాగింగ్ సైట్ 'కూ'లో ఆయన కామెంట్లు రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త డిజిటల్ రూల్స్‌ను సవాలు చేస్తూ వాట్సాప్ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి గురువారం ఈ మేరకు స్పందించారు.

New IT rules not against privacy; tracing messages only for ‘very serious offences’: Govt

భారత దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించే సందేశం సామాజిక మాధ్యమంలో పోస్ట్ అయినపుడు, దానిని మొదట ఎవరు పోస్ట్ చేశారో చెప్పాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయని అన్నారు. ఇందువల్ల నిర్దిష్ట నేరాలను బయటకు తెచ్చే వీలుంటుందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్ట్‌లు, అత్యాచారాలు వంటి నేరాలను ప్రేరేపించే పోస్ట్‌ల విషయంలో కూడా సమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు అందజేయాలని కొత్త రూల్స్ లో ఉందని మంత్రి వివరించారు.

సామాజిక మాధ్యమాల సంస్థలు భారత్ లో కాంప్లియెన్స్ ఆఫీసర్‌ను నియమించాలని, యూజర్ల ఫిర్యాదులపై స్పందించేందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉందని, సోషల్‌ మీడియాలోని సాధారణ యూజర్లు బాధితులు కాకుండా చూసేందుకు, వారికి సాధికారత కల్పించేందుకు, సోషల్ మీడియా దుర్వినియోగం కాకుండా ఉండేందుకు కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. భారత్ చేసిన ఏ ఒక్క ప్రతిపాదన వాట్సాప్ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపించదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+