అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎంఎల్ఏ మృతి

పాట్నా: ప్రమాణస్వీకారం చెయ్యకముందే ఓ శాసన సభ్యుడు గుండె పోటుతో మరణించిన సంఘటన బీహార్ లో జరిగింది. ఆర్ ఎల్ఎస్ సీ (ఎన్డీయే భాగస్వామి) నుంచి పోటి చేసిన బసంత్ కుమార్ మరణించారు.

బీహార్ శాసన సభ ఎన్నికల సందర్బంగా హర్లాఖీ నియోజక వర్గం నుంచి బసంత్ కుమార్ పోటి చేసి గెలుపొందారు. ఇటివల బసంత్ కుమార్ కు చాతి నోప్పి ఎక్కువ రావడంతో ఆసుపత్రికి తరలించారు.

చికిత్స విఫలమై ఆయన మరణించారు. సోమవారం బీహార్ శాసన సభ సమావేశం మొదటి సారి జరిగింది. ఈ సందర్బంలోనే బసంత్ కుమార్ హఠాన్మరణం చెందడంతో సోమవారం జరగవలసిన శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం వాయిదా పడింది.

New MLAs could not take oath due to death of RLSP MLA in Bihar

సభ ప్రారంభం అయిన వెంటనే బసంత్ కుమార్ మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం సభ మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రొటెం స్పీకర్ సదానంద్ సింగ్ తెలిపారు.

బసంత్ కుమార్ మరణం పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ, ఆర్ ఎల్ఎస్ సీ నాయకులు విచారం వ్యక్తం చేశారు. బసంత్ కుమార్ మొదటి సారి శాసన సభ్యుడిగా గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+