రూ.200నోట్లపై ఆర్బీఐ షాకింగ్ నిర్ణయం!?..
అయితే కొత్తగా ప్రవేశపెట్టబోయే రూ.200నోట్ల విషయంలో ఆర్బీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను కేవలం బ్యాంకు బ్రాంచుల ద్వారానే అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రవేశపెట్టిన రూ.2000 నోటుతో చిల్లర కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. మార్కెట్లో రూ.500నోట్లు అందుబాటులో ఉన్నా.. పెద్ద నోటుకు సరిపడా చిల్లర దొరకని పరిస్థితి. దీంతో రూ.200నోటును ప్రవేశపెట్టాలని ఆర్బీఐ యోచిస్తోంది.
2017ఏడాది ముగియక ముందే ఈ కొత్త నోటును మార్కెట్లోకి తీసుకురావాలని ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. దీనివల్ల చిల్లర కష్టాలు తీరనుండగా.. లోయర్ డినామినేషన్ నోట్లకు సంబంధించిన డిమాండ్-సప్లై మధ్య అంతరం తగ్గనుంది. అయితే కొత్తగా ప్రవేశపెట్టబోయే రూ.200నోట్ల విషయంలో ఆర్బీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను కేవలం బ్యాంకు బ్రాంచుల ద్వారానే అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అంటే, ఈ నోట్లను ఏటీఎంలలో అందుబాటులో ఉంచరు. కేవలం బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపేవారికి మాత్రమే వీటిని అందించునున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పెద్ద నోటుకు, చిన్న నోటుకు మధ్య అంతరం భారీగా ఉండటంతో.. రూ.2వేల నోటుకు చిల్లర దొరకడం కష్టంగా మారింది. కొత్త రూ.200నోటుతో ఈ కష్టాలు తీరిపోనున్నాయి. ఇకపోతే రద్దయిపోయిన రూ.1వెయ్యి నోటును ఆర్బీఐ ఇప్పుడప్పుడే ప్రవేశపెట్టబోమని స్పష్టం చేసింది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications