బెంగళూరు స్వామీజీ, నటి రాసలీలలు: కొత్త ట్విస్టీ, ఐపీఎస్ అధికారి రాజీ పంచాయితీ, హనీట్రాప్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని హుణసమారనహళ్ళి ముద్దేవనర వీరసింహాసన సంస్థాన జంగమ మఠాధిపతి కావడానికి సిద్దమైన దయానంద అలియాస్ గురునంజేశ్వర స్వామి, కన్నడ సినీ నటి బెడ్ రూం రాసలీలల వివాదం కొత్త మలుపుతిరుగుతోంది.

దాదాపు రెండు నెలల క్రితం ఆ వీడియో తీశారని శుక్రవారం వెలుగు చూసింది. కన్నడ సినిమాల్లో నటిస్తున్న నటి సహాయంతో గురునంజేశ్వర స్వామీజీని హనీట్రాప్ చేసి వీడియో తీశారని సమాచారం. స్వామీజీ బంధువులు, ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉంటున్నవారే నటి సహాయంతో రహస్యంగా వీడియో తీశారని గ్రామ పంచాయితీ మాజీ సభ్యుడు రామయ్య ఆరోపించారు.

New twist Maddevanapura mutt Gurunnanjeshwar swamij scandal with actress

అప్పటి బెంగళూరు నగర పోలీసు కమిషనర్ జ్యోతిప్రకాష్ మీర్జి సమక్షంలో వీడియో బయటకు రాకుండా రాజీ పంచాయితీ కూడా జరిగిందని రామయ్య ఆరోపించారు. అప్పటి నుంచి ఆ వీడియోను సీడీలు చేసి దయానంద అలియాస్ గురునంజేశ్వర స్వామీజీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని రామయ్య మీడియాకు చెప్పారు.

స్వామీజీ నుంచి రూ. లక్షలు వసూలు చేసి చివరికి సెటిల్ మెంట్ రివర్స్ కావడంతో మీడియాకు రాసలీలల వీడియోను విడుదల చేశారని రామయ్య ఆరోపించారు. మఠంకు చెందిన కోట్లాధిరూపాయల ఆస్తిని స్వాహా చెయ్యడానికి కొందరు కమిటీ సభ్యులు, స్థానికులు కలిసి కుట్ర చేశారని స్థానిక గ్రామ పంచాయితీ మాజీ సభ్యడు రామయ్య ఆరోపించారు.

గురునంజేశ్వర స్వామీజీని వెంటనే మఠం నుంచి తరిమివేయాలని శుక్రవారం స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మఠంకు చెందిన గురునంజేశ్వర స్వామీజీ, స్యాండిల్ వుడ్ నటి రాసలీలల వీడియో పంచాయితీ బెంగళూరు నగర పోలీసులకు ముందే విషయం తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New twist of Maddevanapura mutt Nnanjeshwar Swamiji sex scandal with the actress. The Video made crores of rupees by honey trapping Dayananda alias Nnanjeshwar, said Ex gram panchayath member Ramaiah.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి