2018: అక్లాండ్‌లో తొలి సంబరం, వారికి మాత్రం ఒక్కరోజులో 16సార్లు న్యూఇయర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/న్యూఢిల్లీ/అక్లాండ్: ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సర సంబరాలు అంబరాన్ని అంటాయి. అందరికంటే ముందు న్యూజిలాండ్‌లో 2018 ఆంగ్ల నూతన సంవత్సరం వేడుకలు మొదలయ్యాయి. అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటగానే అక్లాండ్ ప్రజలు వీధుల్లోకి వచ్చి కేరింతలు కొట్టారు.

పరస్పరం ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అక్లాండ్ వాసులు ఘనంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఆస్ట్రేలియాలోను కొత్త సంవత్సరం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సిడ్నీలో అట్టహాసంగా నిర్వహించారు.

ఇలా వరుసగా

ఇలా వరుసగా

ప్రపంచంలోనే తొలుత అక్లాండ్‌లో కొత్త ఏడాది 2018 వచ్చింది. ఆ తర్వాత వరుసగా సిడ్నీ, టోక్యో, బీజింగ్-హాంగ్‌కాంగ్, దుబాయి, ప్యారిస్ - రోమ్-బ్రసెల్స్, లండన్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్‌లలో కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది.

వీరు 16సార్లు కొత్త ఏడాది సంబరాలు జరుపుకుంటారు

వీరు 16సార్లు కొత్త ఏడాది సంబరాలు జరుపుకుంటారు

కొత్త ఏడాది ఎవరికైనా ఒకేసారి వస్తుంది. అర్ధరాత్రి పన్నెండు గంటలు కాగానే సంబరాన్ని అంబరాన్ని అంటుతాయి. ఇలా వేడుకలు జరుపుకోవాలని భావించే వారికి ఈ సంబరాలు జరుపుకునే అవకాశం ప్రతి ఏటా ఒక్కసారి మాత్రమే వస్తుంది. కానీ అందరికీ భిన్నంగా ఆరుగురు వ్యోమగాములు మాత్రం 16సార్లు నూతన సంవత్సర సంబరాలు జరుపుకుంటారు.

16సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూస్తారు, ఎలాగంటే

16సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూస్తారు, ఎలాగంటే

భూమి చుట్టూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) ఒకటి తిరుగుతుంది. అందులో ఉన్న వ్యోమగాములు ఈ సంబరాలను ఒకేరోజు 16సార్లు జరుపుకునే వీలుంది. ఎందుకంటే ఐఎస్‌ఎస్‌ మన భూమిని చుట్టిరావడానికి పట్టే సమయం కేవలం 90 నిమిషాలు. అలా ఇందులోని వ్యోమగాములు ఒక రోజులో 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలను చూస్తారు.

 అలా 16సార్లు కొత్త ఏడాది సంబరాలు

అలా 16సార్లు కొత్త ఏడాది సంబరాలు

ఆ విధంగా చూస్తే వారు ఈ నూతన సంవత్సర వేడుకలను 16 సార్లు జరుపుకొనే వీలుందని నాసా వెల్లడించింది. ఐఎస్‌ఎస్‌లో ఆరుగురు వ్యోమగాములు ఉన్నారు. ఇందులో ముగ్గురు అమెరికాకు చెందినవారు, ఇద్దరు రష్యా, ఒకరు జపాన్‌కు చెందినవారు. కొత్త సంవత్సరానికి ముందు వీరంతా లైఫ్‌ సైన్స్‌ స్టడీస్‌పై పరిశోధనల్లో మునిగిపోయారు.

వైద్యుల సమక్షంలో శిక్షణ

వైద్యుల సమక్షంలో శిక్షణ

ఐఎస్ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) భూమికి 402 కిలోమీటర్ల పైన ఉంది. అంతరిక్ష కేంద్రంలో శారీరకంగా బలహీనపడకుండా వైద్యుల సమక్షంలో వారు శిక్షణ పొందుతున్నారు. అంతరిక్షంలో ఉన్నప్పుడు ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు ఇది దోహదపడనుందని నాసా తెలిపింది.

స్పేస్ వాక్ సమర్థవంతంగా నిర్వహించేంకు

స్పేస్ వాక్ సమర్థవంతంగా నిర్వహించేంకు

అంతరిక్షంలో వ్యోమగాములు స్పేస్‌వాక్ వంటి కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించేందుకు వారి శ్వాస, తదితర అంశాలను వైద్యులు విశ్లేషిస్తున్నారు. వ్యోమగాములు సుదీర్ఘకాలంపాటు అంతరిక్షంలో ఉండేవిధంగా, స్వయం సమృద్ధి సాధించేలా నాసా పరిశోధనలు నిర్వహిస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
One of the things that make New Year’s Eve so special is it only comes once every year — that is, if you’re celebrating on Earth.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి