విషాదం: డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన వారానికే ఉమాశంకర్(44) మృతి
బెంగళూరు: బెంగళూరు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికై కేవలం వారం రోజులకే కన్నుమూశారు రమీల ఉమాశంకర్(44). సెప్టెంబర్ 28న జేడీఎస్‌కు చెందిన రమీల ఉమాశంకర్(44) బెంగళూరు నగర డిప్యూటీ మేయర్‌గా ఎంపికయ్యారు.
బాధ్యతలు తీసుకుని కనీసం వారమైనా గడవకముందే గురువారం రాత్రి తీవ్ర గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆమె కావేరీపుర వార్డు కార్పొరేటర్. ఉమాశంకర్ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె నిబద్ధత కలిగిన సామాజిక కార్యకర్త అని, పార్టీ కోసం ఎంతో చేశారని అన్నారు.

జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం యడ్యూరప్ప రమీల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'నిన్న కూడా రమీల మెట్రో ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆమె మరణం షాక్‌కు గురిచేసింది' అని పలువురు నేతలు వ్యాఖ్యానించారు.
రమీల మరణం బాధ కలిగిస్తోందని మరికొందరు నేతలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రమీల మృతికి సంతాపంగా బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) నగరంలోని పాఠశాలలు, కళశాలలకు సెలవు ప్రకటించింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications