కొత్తగా పెళ్లి , అత్తకొడుకు రాకతో ఆమెపై అనుమానం .. భార్య గొంతు కోసి , ఆపై ..

కొత్తగా పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తికి అనుమానం పెనుభూతం అయింది. నిండు నూరేళ్లు కలిసి సాగాల్సిన ఆ జంట జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. పెళ్లి రెండు నెలలైనా కాకముందే కిరాతకుడు గా మారిన భర్త చేతిలో భార్య హత్యకు గురికాగా, భర్త ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదిలాడు.

 తమిళనాడు రాష్ట్రంలో జరిగింది ఈ సంఘటన .

తమిళనాడు రాష్ట్రంలో జరిగింది ఈ సంఘటన .

భార్యపై అనుమానంతో గొంతు కోసి హతమార్చిన భర్త

భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఒకరిపై ఒకరికి నమ్మకం, ఆ పై గౌరవం. కానీ పెళ్లయి రెండు నెలలైనా కాకముందే భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను దారుణంగా హతమార్చారు . తమిళనాడు రాష్ట్రంలో సేలం జిల్లా వీరాణం ఒరత్తరుపట్టికి చెందిన 33 సంవత్సరాల తంగరాజ్ అనే రైతు , ఆ గ్రామంలో కేబుల్ టీవీ ఆపరేటర్ గా కూడా పని చేస్తున్నాడు. 43 రోజుల క్రితం కన్నంకురిచ్చి గ్రామానికి చెందిన 19 సంవత్సరాల మోనిషా తో తంగరాజ్ వివాహమైంది. తనకు ఉన్న పొలం వద్ద ఇల్లు నిర్మించుకుని భార్యతో కాపురం పెట్టాడు .

భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి


అయితే ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న తంగరాజ్ కిరాతకుడిగా మారాడు . భార్య గొంతు కోసి అత్యంత పాశవికంగా హతమార్చారు. ఆ పై విషం తాగి, కేబుల్ వైరు తో ఉరిపోసుకుని తాను ప్రాణం తీసుకున్నాడు.

ఉదయం భార్యాభర్తలిద్దరూ బయటకి రాకపోయేసరికి, తలుపులు కొట్టిన ఎవరు తీయక పోయేసరికి అనుమానం వచ్చిన బంధువులు లోపలికి వెళ్లి చూడగా గొంతుకోసి హతమార్చిన స్థితిలో మోనిషా, కేబుల్ వైరు ఉరిపోసుకుని వేలాడుతూ తంగరాజ్ మృతదేహాలు కనిపించాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

 పుట్టిన రోజు కేక్ ఇవ్వటానికి వచ్చిన భార్య అత్త కొడుకు .. మొదలైన అనుమానం

పుట్టిన రోజు కేక్ ఇవ్వటానికి వచ్చిన భార్య అత్త కొడుకు .. మొదలైన అనుమానం

ఇక అసలు ఏం జరిగింది అన్న దానిపై విచారణ చేసిన పోలీసులు అనుమానంతోనే భార్యను తంగరాజ్ చంపినట్టుగా ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు . గత నలభై మూడు రోజులుగా వారి ఇంటికి వచ్చి వెళుతున్న వారందరినీ విచారిస్తున్నారు .

గత నెల 24వ తేదీన పోలీసుల అత్త అయిన మోహన కుమారుడు తంగ రాజ్ ఇంటికి వచ్చి వెళ్ళినట్లుగా బంధువులు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇవ్వడానికి అత్త కుమారుడు వచ్చిన నేపథ్యంలో తంగ రాజ్ కు అనుమానం మొదలైంది.

భార్యను చంపి , విషం తాగి, ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్య

భార్యను చంపి , విషం తాగి, ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్య

ఇదే సమయంలో మోనిషా సోదరి ఆమె అత్త మోహన కు ఉన్న మరో కుమారుడితో చెట్టాపట్టాలేసుకుని తిరగడాన్ని చూసిన తంగరాజ్ లో అనుమానం పెనుభూతం అయింది. ఈ అనుమానంతోనే భార్య మోనిష గొంతుకోసి దారుణంగా హతమార్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తంగరాజ్ ముందుగా విషం తాగి ఆ తర్వాత ఉరి వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+