టిక్‌టాక్ ట్రాజెడీ : పెళ్లయిన రెండు నెలలకే.. ఆ కుటుంబంలో తీరని విషాదం..
టిక్‌టాక్ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. ఒక్క వీడియోతో టిక్‌టాక్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయాలని.. రాత్రికి రాత్రే టిక్‌టాక్ సెలబ్రిటీ అయిపోవాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది రిస్కీ స్టంట్స్ చేస్తూ ప్రాణాలే పోగొట్టుకున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ కొత్త పెళ్లి కొడుకు ఇలాగే ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్‌నగర్‌కి చెందిన కపిల్(23)కి రెండు నెలల క్రితం వివాహం జరిగింది. బుధవారం హోలీ వేడుకల సందర్భంగా కిందిదియా గ్రామంలో టిక్‌టాక్ కోసం ట్రాక్టర్‌పై స్టంట్స్ చేశాడు. ఆ సమయంలో మరో వ్యక్తి సెల్‌ఫోన్‌లో అతని స్టంట్స్ చిత్రీకరిస్తున్నాడు. అయితే ఆ క్రమంలో అతను ట్రాక్టర్ స్టీరింగ్‌పై పట్టు కోల్పోవడంతో.. వాహనం ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కపిల్ వాహనం కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు చెబుతున్న దాని ప్రకారం.. కపిల్ ట్రాక్టర్‌ను వేగంగా నడుపుతూ.. ముందు చక్రాలను గాల్లోకి లేపే ప్రయత్నం చేశాడు. అయితే ఆ క్రమంలో ట్రాక్టర్ అమాంతం బోల్తా కొట్టడంతో.. కపిల్ దాని కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లయిన రెండు నెలలకే కపిల్ దుర్మరణం చెందడంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.ఘటనపై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు.

Recommended Video

ముజఫర్‌నగర్‌లో గత 15 రోజుల్లో ఇలాంటి టిక్‌టాక్ దుర్ఘటన చోటు చేసుకోవడం ఇది రెండోసారి. గత ఫిబ్రవరి 28న రాజ్ ఖరేషీ(18) టిక్‌టాక్ వీడియో కోసం ఓ కెనాల్‌లోకి జంప్ చేయగా.. తల బండరాయికి బలంగా తాకి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే కెనాల్‌లో అతను కొట్టుకుపోవడంతో పోలీసులు కొన్ని గంటల పాటు గాలించి ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకు తీశారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications