జాతి తక్కువ, చంపేస్తాం: పోలీసులు మాత్రం, కోర్టును ఆశ్రయించిన ప్రేమ జంట !
ప్రేమ వివాహం చేసుకున్న నవవధూవరులకు చంపేస్తాం అంటూ బెదిరింపు ఫోన్లు ఎక్కువ కావడంతో వారు కోర్టును ఆశ్రయించి భద్రత కల్పించాలని మనవి చేశారు.
బెంగళూరు: ప్రేమ వివాహం చేసుకున్న నవవధూవరులకు చంపేస్తాం అంటూ బెదిరింపు ఫోన్లు ఎక్కువ కావడంతో వారు కోర్టును ఆశ్రయించి భద్రత కల్పించాలని మనవి చేశారు. మా ప్రాణాలకు ఏదైనా జరగరానిది జరితే అందుకు మా కుటుంబ సభ్యులే కారణం అంటూ కోర్టులో కేసు పెట్టారు.
కర్ణాటకలోని హుబ్బళి-దారావాడ జంట నగరాల సమీపంలోని ఎత్తినగుడ్డ ప్రాంతంలో నివాసం ఉంటున్న దేవేంద్ర గౌడ, పవిత్ర గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పవిత్ర కంటే దేవేంద్ర తక్కువ కులం కావడంతో పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇదే సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. జూన్ 29వ తేది చట్టప్రకారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటి నుంచి దేవేంద్ర, పవిత్ర దంపతులకు ఫోన్లు చేసి మిమ్మల్ని చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారు.
ప్రాణాలు తీస్తామని బెదిరింపులు ఎక్కువ కావడంతో హుబ్బళి- దారవాడలోని ఉప నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు దేవేంద్ర, పవిత్రలను పట్టించుకోకుండా కేసు నమోదు చెయ్యకపోవడంతో గురువారం కోర్టును ఆశ్రయించారు. పవిత్ర కుటుంబ సభ్యుల మీద చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications