వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యాయం దక్కట్లేదు -ఆ రెండే కారణాలు -డబ్బు లేకుండా చేయగలరా? -జస్టిస్ ఎన్వీ రమణ అనూహ్య వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

మరో నెల రోజుల్లో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) పదవి చేపట్టనుండగా, దేశంలో న్యాయవ్యవస్థ పనితీరు, పేదలకు అందుతోన్న న్యయ సహాయంపై జస్టిస్ ఎన్వీ రమణ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే పదవీకాలం ఏప్రిల్ 23తో ముగియనుండగా, ఆయన తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియరైన రమణకే ఛాన్స్ ఉంది. సదరు ప్రక్రియకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సిట్టింగ్ సీజేఐకి లేఖ కూడా రాసింది. అయితే, ఏపీ సీఎం జగన్ సంచలన ఆరోపణల దరిమిలా జస్టిస్ రమణకు అత్యున్నత పదవి దక్కే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతలోనే న్యాయ సంబంధిత అంశాలపై జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యంగా మారాయి.

 షాక్: లోక్‌సభ లాబీలోనే బెదిరించాడు -ఎంపీ నవనీత్ కౌర్ సంచలనం -చిక్కుల్లో సేన ఎంపీ సావంత్ -మహా డ్రామా షాక్: లోక్‌సభ లాబీలోనే బెదిరించాడు -ఎంపీ నవనీత్ కౌర్ సంచలనం -చిక్కుల్లో సేన ఎంపీ సావంత్ -మహా డ్రామా

నల్సా రజతోత్సవ ప్రసంగంలో

నల్సా రజతోత్సవ ప్రసంగంలో

దేశంలో న్యాయ సంబంధిత వ్వహారాలన్నీ ఖరీదైనవిగా మారిపోయిన దరిమిలా కోర్టు ఖర్చులు భరించలేని పేదలకు ఉచితంగా న్యాయ సహాయం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటైన 'నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా)కి 25 ఏళ్లు నిండిన సందర్భంగా సోమవారం రజతోత్సవాలు నిర్వహించారు. సుప్రీంలో సీజేఐ తర్వాత సీనియర్మోస్ట్ జడ్జి అయిన ఎన్వీ రమణ నల్సాకు చైర్మన్ హోదాలో కీలక ప్రసంగం చేశారు. నల్సా ఉద్దేశాలను, లక్ష్యాలను లాయర్లకు వివరిస్తూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారిలా..

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు వైసీపీ ఎంపీ రఘురామ పోరు -ప్రధాని మోదీకి ఫిర్యాదు -తిరుపతి నుంచే షురూఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు వైసీపీ ఎంపీ రఘురామ పోరు -ప్రధాని మోదీకి ఫిర్యాదు -తిరుపతి నుంచే షురూ

74 ఏళ్లయినా న్యాయం దక్కట్లేదు..

74 ఏళ్లయినా న్యాయం దక్కట్లేదు..

''భారతదేశం ఆధునికతను సంతరించుకుంటూ అత్యంత వేగంగా ముందుకు పోతున్నదని తరచూ మనం వింటుంటాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా పలు రంగాల్లో మనం ఎంతగానో ముందుకు వెళ్లామని దేశ, విదేశాల్లో అనేక వేదికలపై చర్చించుకుంటాం. అయితే ఈ విజయగాథ వెనుక మరో కోణం కూడా ఉంది. న్యాయ రంగానికి సంబంధించినంత వరకు పరిస్థితి మరోలా ఉందన్నది కాదనలేని వాస్తవం. స్వాతంత్ర్యం పొంది 74 ఏళ్లు అవుతున్నా మన దేశంలో ఇప్పటికీ కొన్ని లక్షల మందికి కనీస న్యాయ సహాయం అందడంలేదు తద్వారా వారికి సరైన న్యాయం దక్కడంలేదన్నది చేదు నిజం. ఇందుకు..

ఆ రెండే ప్రధాన సమస్యలు

ఆ రెండే ప్రధాన సమస్యలు

వేగాన్ని అందిపుచ్చుకున్న ప్రస్తుత ఆధునిక కాలంలో 'అందరికీ న్యాయం దక్కాలి' లాంటి చర్చను అదేదో పాతబడిన అంశంగా భావిస్తున్నారు. కానీ ఇవాళ్టికి కూడా కొన్ని లక్షల మంది పేదలు ప్రాథమిక హక్కులు కూడా లేకుండా, కనీస న్యాయ సహాయం కూడా అందని దుస్థితిలో ఉన్నారు. ఇది నిజంగా అత్యంత విచారకరం. ఈ పరిస్థితికి ప్రధానంగా రెండు కారణాలని చెప్పొచ్చు. ఒకటి పేదరికం, రెండు నిరక్ష్యరాస్యత. ఈ జంట సమస్యల సుడిలో 'కనీస న్యాయం' చిక్కుకుపోయినట్లు గుర్తించాం. అయితే..

గాంధీ, నెహ్రూ బాటలో..

గాంధీ, నెహ్రూ బాటలో..

దేశంలోని పేద ప్రజలకు కనీస న్యాయ సహాయం దక్కడంలేదనే వాస్తం విచారకరమే అయినా, దాన్ని మనం డీమోటివేట్ చేసే అంశంగా భావించొద్దు. జాతీయ నేతలను గుర్తు చేసుకూంటూ, సమాజం పట్ల, పేదల పట్ల మన కర్తవ్యాన్ని నిరవేర్చుతూ ముదుకెళ్లాలి. న్యాయవాదులైన మిత్రులకు ఓ విషయం చెప్పదల్చుకున్నాను. గాంధీ, నెహ్రూ, పటేల్ లాంటి దేశనేతల వారసులమమైన మనం సమాజం పట్ల మన కర్తవ్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. నల్సా రజతోత్సవం సందర్భంగా ఓ ముఖ్యమైన మాటతో నేను ముగిస్తాను..

డబ్బులు తీసుకోకుండా చేయండి..

డబ్బులు తీసుకోకుండా చేయండి..

దయచేసి లాయర్లందరూ సమాజంలో బలహీనమైన వారి గొంతుకను వినండి. న్యాయం కోసం డబ్బులు చెల్లించలేని వారి దుస్థితిని అర్థం చేసుకోండి. మీకు వీలైనప్పుడల్లా పేదలకు న్యాయ సహాయం చేయండి. లాయర్లు దేశానికి ఏదైనా తిరిగివ్వగలరంటే అది డబ్బులు తీసుకోకుండా పేదలకు న్యాయ సేవ చేయడం ద్వారానే సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను. కోవిడ్ -19 విలయ కాలంలో నేషనల్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీ ఆదిశగా చాలా వరకు పాటుపడింది. రాబోయే రోజుల్లో పేదలకు మరింత న్యాయ సహాయం అందేలా నల్సా దృష్టిపెట్టింది'' అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. పేరు ఖరారు కానప్పటికీ, సీనియారిటీ దృష్ట్యా సీజేఐ అయ్యే అవకాశాలు జస్టిస్ రమణకే ఉండగా, కేంద్రం రాసిన లేఖపై సిట్టింగ్ సీజేఐ బోబ్డే ఇంకా స్పందించాల్సిఉంది.

English summary
Justice NV Ramana, who is next in line to be the next Chief Justice of India, on Monday said that India is still dealing with questions of access to justice. Justice Ramana encouraged lawyers to do more pro bono work for the sake of justice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X