తదుపరి ముఖ్యమంత్రిగా కుమారస్వామి: ఎమ్మెల్యేల హైదరాబాద్ తరలింపు మలుపుతిప్పింది
బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కుమారస్వామి ముఖ్యమంత్రి కానున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆయన సీఎం కానున్నారు. గవర్నర్ ఆయనను ఆహ్వానించి బలం నిరూపించుకునేందుకు సమయం ఇవ్వనున్నారు.
కాగా, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను రక్షించుకోవడంలో గులాం నబీ ఆజాద్, శివకుమార్ వంటి కాంగ్రెస్ నేతలు సఫలమయ్యారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించడంతో బీజేపీకి ఏమాత్రం అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీపై చాలా రోజుల తర్వాత గెలిచారని అంటున్నారు.

యడ్యూరప్ప రాజీనామాను ఆమోదించిన అనంతరం కుమారస్వామిని గవర్నర్ వాజుబాయి వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు. కాగా బలనిరూపణకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications