అనూహ్య మలుపు తిరిగిన పహల్గామ్ ఉగ్రదాడి..!!
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ బిగ్ బ్రేక్ త్రూ సాధించింది. ఈ ఘటనతో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులు- ఈ అమానుష ఘటనకు సంబంధించిన దర్యాప్తులో కీలక మలుపుగా భావిస్తోన్నారు. విచారణ సందర్బంగా ఉగ్రవాద దాడి మూలాలు వెలుగులోకి వస్తాయని అంచనా వేస్తోన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో ఉగ్రవాదులు మారణ హోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. కాశ్మీర్ అందాలను తిలకించడానికి వచ్చిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఇద్దరు ఏపీకి చెందిన వాళ్లూ ఉన్నారు.

ఈ ఘటనపై విచారణ బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది.. కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో ఈ నరమేధానికి పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులే కారణమని ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలపై పాక్ వైఖరిని ఎండగట్టింది. ఆ దేశంపై యుద్ధానికీ దిగింది.
ఈ క్రమంలో- తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేయడంతో కీలక మలుపు తిరిగినట్టయింది. పర్వేజ్ అహ్మద్ జొథార్, బషీర్ అహ్మద్ జొథార్ అరెస్ట్ అయ్యారు. పర్వేజ్ స్థానికుడే. పహల్గామ్ సమీపంలోని బట్ కోట్ అతని స్వస్థలం. బషీర్ అహ్మద్ హిల్ పార్క్‌కు చెందిన వ్యక్తి. ఈ ఇద్దరిపై అసాంఘిక కార్యకలాపాల నివారణచట్టం (యూఏపీఏ) సెక్షన్ 19 కింద అరెస్టు చేసింది ఎన్ఐఏ.
విచారణ సందర్భంగా పహల్గామ్ దాడికి పాల్పడిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు సంబంధించిన పూర్తి వివరాలను వాళ్లు వెల్లడించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ తెలిపింది. ఆ ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా (LeT)కు చెందిన పాకిస్తాన్ జాతీయులని కూడా ధృవీకరించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
దీని ప్రకారం- దాడికి ముందు పర్వేజ్, బషీర్.. ఆ ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు హిల్ పార్క్ లోని ఓ గుడిసెలో ఆశ్రయం కల్పించారు. వారికి ఆహారాన్నీ సమకూర్చారు. అలాగే- రవాణా వసతిని సైతం అందుబాటులో ఉంచినట్లు ఎన్ఐఏ వివరించింది. వారి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టుకుంటోన్నట్లు ఎన్ఐఏ తెలిపింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications