బాంబు పేలుడు కేసు: రంగంలోకి దిగిన ఎన్ఐఏ
బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఎంజీ రోడ్డు సమీపంలోని చర్చిస్ట్రీట్ బాంబు పేలుడు కేసు దర్యాప్తు నేషనల్ ఇన్వేష్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారుల చేతికి వెళ్లింది. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు బెంగళూరులోని చర్చిస్ట్రీట్ చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
2014 డిసెంబర్ 28వ తేదిన రాత్రి 8.15 గంటల సమయంలో చర్చిస్ట్రీట్ లోని కోకోనెట్ గ్రేవ్ రెస్టారెంట్ దగ్గర జరిగిన బాంబు పేలుడులో చెన్నయ్ కి చెందిన భవాని (37) అనే మహిళ మరణించింది. ముగ్గురుకి తీవ్రగాయాలు అయ్యాయి.
కేసు నమోదు చేసిన పోలీసులు పలు రాష్ట్రాలలో దర్యాప్తు చేసినా ఫలితం లేకపోయింది. కేంద్రప్రభత్వం జోక్యం చేసుకుని కేసు దర్యాప్తు వివరాలు ఇవ్వాలని అడిగింది. ఈ కేసు విషయంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా స్పందించారు.

ఆయనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఉత్తరం వ్రాసి ఫోన్ చేసి మాట్లాడు. కేసు ఎన్ఐఏ అధికారుల చేతికి వెళ్లింది. కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు చర్చిస్ట్రీట్ బాంబు పేలుడుకు, చెన్నయ్ రైల్వే స్టేషన్ లో జరిగిన బాంబు పేలుడుకు పోలీకలు ఉన్నాయని అంటున్నారు.
బెంగళూరు నగర పోలీసులు, బెంగళూరు సీసీబీ పోలీసులు, ప్రత్యేక టీం పోలీసులు దర్యాప్తు చేసిన నివేదికలను ఎన్ఐఏ అధికారులు పరిశీలిస్తున్నారు. బెంగళూరు పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధం లేకుండ ఎన్ఐఏ అదికారులు మళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications