దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు: హైదరాబాద్‌కు యాసిన్‌భత్కల్!
న్యూఢిల్లీ: ఇండియన్ ముజాహిదీన్ స్థాపకుల్లో ఒకడైన ఉగ్రవాది యాసిన్ భత్కల్‌ను ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకువెళ్లేందుకు ఎన్‌ఐఏ కోర్టు అనుమతించింది. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో యాసిన్ భత్కల్‌ను ఎన్ఐఏ విచారించనుంది.
నాలుగు రోజుల ఎన్ఐఏ కస్టడీ ముగిసిన అనంతరం జిల్లా జడ్జి ఐఎస్ మెహతా ఎదుట నిందితుడు భత్కల్ ను ప్రవేశపెట్టారు. దేశంలో జరిగిన మిగితా తీవ్రవాద కార్యకలాపాల గురించి తెలుసుకోవడానికి అతన్ని నిర్బంధించి విచారించాల్సిన అవసరం లేదని ఎన్ఐఏ తెలిపింది. అయితే ఎన్ఐఏ హైదరాబాద్ విభాగం భత్కల్‌ను హైదరాబాద్‌కు తీసుకెళ్లి విచారించేందుకు అనుమతి పొందింది. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు భత్కల్‌ను ఎన్ఐఏ విచారించనుంది.

హైదరాబాద్ ఎన్ఐఏ విభాగానికి నిందితుడు మహ్మద్ అహ్మద్ సిద్దిబప్ప అలియాస్ యాసిన్ భత్కల్‌ను విచారించేందుకు కోర్టు రెండు రోజులపాటు ట్రాన్సిట్ రిమాండ్‌కు అనుమతించింది. సెప్టెంబర్ 23న భత్కల్‌ను హైదరాబాద్ ఎన్ఐఏ విభాగానికి చెందిన ఎస్పీ సంబంధిత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ కోణార్క్, వెంకటాద్రి థియేటర్ల సమీపంలో ఫిబ్రవరి 21న జంట పేలుళ్లు జరిగి 16మంది మృతి చెందగా సుమారు వందమంది గాయాలపాలయ్యారు.












Click it and Unblock the Notifications