leader: అధికార పార్టీ లీడర్ హత్య, ఫంక్షన్ హాల్ తో సహ 20 ఎకరాలు ?, అక్కడే హత్యకు స్కెచ్ వేస్తే ?
ఓ హిందూ సంఘ, సంస్థ నాయకుడిని హత్య చెయ్యడానికి పీఎఫ్ఐ నాయకులు ఏకంగా ఫంక్షన్ హాల్ లో మీటింగ్ పెట్టారని వెలుగు చూసింది.
బెంగళూరు/మంగళూరు: హిందూ సంఘాల కార్యకర్తలు, నాయకులను హత్య చేస్తున్నారని ఇప్పటికే పీఎఫ్ఐ తదితర సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఓ హిందూ సంఘ, సంస్థ నాయకుడిని హత్య చెయ్యడానికి పీఎఫ్ఐ నాయకులు ఏకంగా ఫంక్షన్ హాల్ లో మీటింగ్ పెట్టారని వెలుగు చూసింది. ఫంక్షన్ హాల్ లో ఏదో కార్యక్రమం జరుగుతోందని బయట అందరూ అనుకున్నారు. అయితే లోపల జరిగింది వేరు అని, అక్కడ జరిగిన తతంగం ఆ హిందూ యువకుడు హత్య జరిగిన తరువాత వెలుగు చూసింది. హిందూ యువకుడి హత్యకు స్కెచ్ వేసిన ఆ ఫంక్షన్ హాల్ తో సహ ఆ సంస్థకు చెందిన మొత్తం ఆస్తిని ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బీజేపీ నాయకుడి దారుణ హత్య
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. సొంత పార్టీ అధికారంలో ఉందంటే ఎక్కడైనా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హల్ చల్ చెయ్యడం సర్వసాధారణం. అయితే సొంత పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే కర్ణాటకలోని దక్షి కన్నడ జిల్లాలో బీజేపీ నాయకుడు ప్రవీణ్ నెట్టారు అలియాస్ ప్రవీణ్ హత్యకు గురికావడం కలకలం రేపింది.

ఎన్ఐఏ ఎంట్రీ..... ఫంక్షన్ హాల్ సీజ్
ప్రవీణ్ హత్య కేసును కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ఐఏ అధికారులకు అప్పగించింది. బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్యకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బంట్వాళ తాలూకాలోని మిట్టూరులోని ముస్లీం కమ్యూనిటీ హాల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) స్వాధీనం చేసుకుంది.ఇడ్కిడు గ్రామంలో మిట్టూరు ఫ్రీడమ్ కమ్యూనిటీ హలాల్‌కు సంబంధించిన 20 ఎకరాలను భూమిని కూడా ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ?
ఎన్‌ఐఏ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు బెంగళూరు కార్యాలయ చీఫ్ షణ్ముగం గురువారం ఉత్తర్వులు జారీ చేసి, ఆర్డర్ కాపీని ఫంక్షన్ హాల్ యజమానికి, దక్షిణ కన్నడ జిల్లా కలెక్టర్, ఆ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌లకు పంపారు. ఈ ఉత్తర్వు ప్రకారం ఎన్ఐఏ అధికారులు ఫంక్షన్ హాల్ తో స ఆ ప్రాంతంలోని భూమిని స్వాధీనం చేసుకుంది.

20 ఎకరాల్లో ఏం కూడా చెయ్యకూడదు
ఎన్ఐఏ అధికారుల ఆధీనంలో ఉన్న పంక్షన్ హాల్ కు సంబంధించిన భూమి మీద రుణం తీసుకోవడం. లేదా అద్దెకు లేదంటే లీజుకు ఇవ్వకూడదని, ఎవ్వరూ తీసుకోరాదని ఎన్ఐఏ అధికారులు, స్థానిక పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలను సులభతరం చేసేందుకు పీఎఫ్‌ఐ కార్యకర్తలు ఇదే ఫంక్షన్ హాల్ లో చట్టవిరుద్ధంగా శిక్షణ ఇస్తోందని ఎన్‌ఐఏ విచారణలో వెలుగు చూసింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications