శ్రీనగర్ సెంట్రల్ జైల్లో పాకిస్తాన్ జెండా, మొబైల్ ఫోన్లు, జిహాదీ సాహిత్యం

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీనగర్: జాతీయ దర్యాఫ్తు సంస్థ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ - ఎన్ఐఏ) సోమవారం శ్రీనగర్‌లోని కేంద్ర కారాగారంలో సోదాలు నిర్వహించి పాకిస్తాన్ జెండా, మొబైల్ ఫోన్లు, జిహాదీ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకుంది.

ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. దాదాపు 25 మొబైల్‌ ఫోన్లు లభ్యమైనట్లు అధికారులు చెప్పారు. కొన్ని హార్డ్‌వేర్‌ డిస్క్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 20 మంది బృందంతో కూడిన ఎన్‌ఐఏ సిబ్బంది, జమ్ము కాశ్మీర్‌ పోలీసులు, సీఆర్పీఎఫ్‌, ఎన్‌ఎస్‌జీ సిబ్బంది జైలులోని పలు గదులను విస్తృతంగా తనిఖీలు చేశారు.

NIA raids Srinagar Central jail, seizes Pakistani flag, mobile phones and jihadi literature

కొన్ని సిమ్‌కార్డులు, ఐదు ఎస్డీ కార్డులు, అయిదు పెన్ డ్రైవ్‌లు, ఒక ఐప్యాడ్‌, నిషేధిత మ్యాగజైన్లు, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ జెండాలు లభ్యమయ్యాయి. తనిఖీల కార్యక్రమాన్ని అధికారులు డ్రోన్ల ద్వారా పర్యవేక్షించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A National Investigation Agency (NIA) team on Monday raided the Srinagar Central Jail and seized a Pakistani flag, mobile phones and jehadi literature, police sources said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి