ఉద్యోగం పేరిట నాగాలాండ్ యువతిపై నైజీరియన్ రేప్

న్యూఢిల్లీ: ఉద్యోగం ఇప్పించడంతోపాటు వివాహం చేసుకుంటానని చెప్పి నమ్మించి నాగాలాండ్‌కు చెందిన ఓ యువతిపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన నైజీరియన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశ రాజధాని న్యూడిల్లీలో చోటు చేసుకుంది.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ద్వారా నిందితుడు తనకు ఆరు నెలల క్రితం పరిచయమయ్యాడని తెలిపింది. తాను గుర్గావ్‌లోని ఓ బహుళజాతి సంస్థలో పని చేస్తున్నానని చెప్పిన అతడు, తనకు ఆ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడని బాధితురాలు పేర్కొంది. దీంతో తామిద్దరం అప్పుడప్పుడు కలుసుకునే వారమని ఆమె తెలిపింది.

ఆ తర్వాత వివాహం చేసుకుంటానని నమ్మించిన నిందితుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక గదిలో బంధించి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని ఆమెను హెచ్చరించాడు. అతనికి సహకరించకపోతే ఆమెను తీవ్రంగా కొట్టేవాడు.

Nigerian held in Delhi for raping girl from Nagaland

చివరకు ఆ యువతి ఎలాగోలా తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. ఆదివారం రాత్రి మౌరీస్‌నగర్ పోలీస్‌స్టేషన్ లో నిందితుడిపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సోమవారం నిందితుడ్ని అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధిత యువతిని ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన బాధితురాలు, ఉద్యోగం కోసం వెదుకుతోందని పోలీసులు చెప్పారు.

పుణెలో హోటల్ యజమాని అనుమానాస్పద మృతి

పుణె: మహారాష్ట్రంలోని పుణెలో ఓ హోటల్ యజమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వ్యాపారవేత్త ఈశ్వర్దాస్ ఖోర్డియా కుమారుడైన అజయ్ ఖోర్డియా హోటల్ డబుల్ ట్రీ బై హిల్టన్‌లో సోమవారం సాయంత్రం మృత్యువాత పడివున్నాడు. పంఛశిల్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా అజయ్.. ఛింఛ్వాడ్ పట్టణంలో హోటల్ డబుల్ ట్రీ బై హిల్టన్ హోటల్ నిర్వహిస్తున్నాడు.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. అజయ్ ఖోర్డియా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడని అనుమానిస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అజయ్ అన్నయ్య అతుల్, తమ్ముడు సాగర్ తమ గ్రూపుకు సంబంధించిన రియల్ ఏస్టెట్ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. వీరిద్దరూ అజయ్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం అనుమానం వచ్చి ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+