వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో కూడా రాత్రి పూట కర్ఫ్యూ.. ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో..

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ భయాందోళన కలిగిస్తోంది. దాదాపు 100 దేశాల్లో ఇప్పటికే ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అటు కోవిడ్, ఇటు ఒమిక్రాన్‌ను ఎట్టిపరిస్థితుల్లో నిలువరించేందుకు అన్ని శక్తులను ఒడ్డుతోంది. దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా నిలువరించే దిశగా భారత్ అన్ని చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. ఆ జాబితాలో ఢిల్లీ కూడా చేరింది.

కొద్ది రోజులుగా దేశ రాజధానిలో ఓ వైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయింది. ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆదివారం ఆప్ సర్కార్ ప్రకటించింది. సోమవారం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రోజూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో ఇవాళ కొత్తగా 290 కోవిడ్ కేసులు నమోదుకాగా, ఒకరు చనిపోయారు. ఢిల్లీలో శనివారం నమోదైన కోవిడ్ కేసులతో పోల్చితే.. 16 శాతం ఎక్కువ కేసులు ఇవాళ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

 Night curfew in Delhi from 11 pm - 5 am starting Monday amid surge in Covid cases

భారత్‌లో కూడా రాష్ట్రాలకు పాకుతున్నాయి. ఇవాళ హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌‌లో ఒమిక్రాన్ కేసు వెలుగుచూశాయి. తొలుత ఎంపీ నైట్ కర్ఫ్యూ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ అక్కడ కూడా కేసు వచ్చింది. ఒక్కరోజే సింగిల్ డిజిట్ వచ్చింది. కేసులు పెరుగుతున్నందున.. 31, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సందర్భంగా ఆంక్షలు ఉంటాయి. గుంపులు గుంపులుగా జనం ఉండొద్దని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంచేశాయి.

ఇటు ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ కూడా రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. అన్నీ రాష్ట్రాలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు విధించాయి. ఇటు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించింది.

English summary
Delhi imposes a night curfew from 11pm till 5 am which will come into effect from Monday. The national capital has witnessed a surge in the number of coronavirus cases in the last few days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X