ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్, లవ్లీనాకు స్వర్ణాలు: కేసీఆర్ హర్షం
న్యూఢిల్లీ: మహిళ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ స్వర్థాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే రెండు బంగారు పతకాలు కైవసం చేసుకున్న భారత్.. తాజాగా మరో రెండు స్వర్ణాలను తన ఖాతాలో వేసుకుంది. 50 కిలోల విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్(Nikhat Zareen) బంగారు పతకం సాధించింది.
Nikhat becomes just the 2⃣nd Indian woman after MC Mary Kom to win successive Boxing World Championship titles✨
— The Bridge (@the_bridge_in) March 26, 2023
She defeats two-time Asian champion Nguyen Thi Tam of Vietnam in the final to create history — Was never ever in doubt! 💪#Boxing 🥊 pic.twitter.com/njeddRCZp3
ప్రత్యర్థి, రెండుసార్లు ఆసియా ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న వియత్నాంకు చెందిన న్యూయెన్ టాన్‌పై 5-0తో విజయం సాధించింది. నిఖత్ జరీన్ వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించారు. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన రెండో భారత భాక్సర్‌గా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించారు.

గత సంవత్సరం 52 కేజీల విభాగంలో పసిడి దక్కించుకున్న నిఖత్ జరీన్.. ఈసారి 50 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు, 75 కిలోల విభాగంలో లబ్లీనా బోర్గోహెయిన్ స్వర్ణ పతకం సాధించింది. ఆస్ట్రేలియాకు చెందిన కైత్లిన్ పార్కర్‌పై 5-2 తేడాతో విజయం సాధించింది. టోక్యోలో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన లవ్లీనా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ సాధించడం ఇదే తొలిసారి.
తాజా విజయంతో మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్-4 బంగారు పతకాలు గెలిచింది. కాగా, శనివారం భారత్ రెండు బంగారు పతకాలు సాధించింది. 48 కేజీల విభాగం నీతు గంగాస్ 5-0 తేడాతో లుత్సాయిఖాన్(మంగోలియా)ను చిత్తు చేశారు. ఇక 81 కేజీల విభాగం టైటిల్ పోరులో స్వీటీ 4-3 తేడాతో వాంగ్ లీనా(చైనా)పై పోరాడి గెలిచింది. విజేతలకు ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రముఖులు అభినందనలు తెలిపారు.
𝐓𝐇𝐈𝐑𝐃 𝐆𝐎𝐋𝐃 🥇 𝐅𝐎𝐑 𝐈𝐍𝐃𝐈𝐀 🇮🇳
— Doordarshan Sports (@ddsportschannel) March 26, 2023
NIKHAT ZAREEN beat Nguyen Thi Tam of Vietnam by 5⃣-0⃣ in the 𝐅𝐈𝐍𝐀𝐋 🥊#WorldChampionships #WWCHDelhi #Boxing #WBC2023 #WBC @nikhat_zareen #NikhatZareen pic.twitter.com/EjktqCP4pi
కేసీఆర్ హర్షం
తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు అభినందనలు తెలియజేశారు. నిఖత్ జరీన్ తెలంగాణకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. ప్రపంచస్థాయిలో తెలంగాణ ఖ్యాతిని చాటారన్నారు.












Click it and Unblock the Notifications