నిపా వైరస్: చనిపోతూ భర్తకు నర్స్ లేఖ, కన్నీళ్ళు ఆగవు
Recommended Video

తిరువనంతపురం: నిపా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న ఓ నర్సు కూడ ఈ వ్యాధికి గురై మరణించింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకొంది. మరణించే ముందు ఆమె తన భర్తకు రాసిన లేఖ చదివిన వారు కన్నీరు పెట్టుకోకుండా ఉండలేరు.
కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కారణంగా 15 మందికి మృత్యువాత పడ్డారు. అయితే ఈ వ్యాధి సోకిన వారికి చికిత్స అందిస్తున్న కోజికోడ్ కు చెందని లినీ అనే నర్సుకు కూడ వ్యాధి సోకింది.

నిపా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో నర్సు లినీకి కూడా ఆ వ్యాధి సోకింది. కొద్దిరోజుల్లోనే ఆమె ప్రాణాలు కోల్పోయారు. మరణానికి కొద్ది గంటల ముందు భర్తకు లినీ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఒకరి నుంచి మరొకరికి నిపా వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో కుటుంబసభ్యులకు కనీసం ఆఖరి చూపుకైనా లేకుండా లినీ భౌతికకాయానికి దహనసంస్కారాలు నిర్వహించారు.
నేను చనిపోబోతున్నానని నాకు తెలుసు. నిన్ను కలుసుకునే సమయం లేదని కూడా తెలుసు. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నీతో పాటు వాళ్లను గల్ఫ్‌కు తీసుకెళ్లు. నేనులేను అని మా నాన్నలానే జీవితాంతం ఒంటరిగా ఉండకు ఇవి నిపా వైరస్ సోకి మరణశయ్యపై ఉన్న నర్సు లినీ(31) తన భర్తకు లేఖ రాశారు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లినీ మరణంపై స్పందించిన డాక్టర్ దీపూ సెబిన్ దేశ ప్రజల రక్షణలో భాగస్వామ్యమై ప్రాణాలు వదిలిన లినీ వీర మరణం పొందారని, ఆమె అమరవీరురాలు కాకపోతే మరెవరో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. కాగా, నిపా వైరస్ సోకి పలువురు కేరళలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరు నర్సులు ఉన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications