Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Nipah: మరోసారి వణికిస్తున్న ప్రాణాంతక వైరస్ నిపా, కేరళలో ఇద్దరు మృతి

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో మరోసారి ప్రమాదకర నిపా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో రెండు అసహజ మరణాలు సంభవించాయి. అయితే, ఈ మరణాలు నిపా వైరస్ కారణంంగానే సంభవించినట్లు కేరళ వైద్యారోగ్యశాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం వైద్యాధికారులతో ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

అసహజ మృతి చెందినవారి బంధువులు కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఇద్దరి మరణాలకు గల కారణాలను అన్వేషించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం వరకు దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం రానుంది. మొదటి మరణం ఆగస్టు 30న సంభవించిందని అధికారులు చెప్పారు.

Nipah

కాగా, 2018 నుంచి 2021 వరకు కేరళలో అనేక నిపా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దక్షిణ భారత్‌లో 2018 మే 19న మొదటి నిపా వైరస్ కేసు నమోదైంది. 2019లో మరోసారి నిపా కేసులు వెలుగులోకి వచ్చాయి. 2021లో మెదడువాపు వ్యాధితో చనిపోయిన బాలుడిలో నిపా వైరస్‌ను వైద్యులు గుర్తించారు. కాగా, నిపా వైరస్‌ను 1989లో మలేషియాలో తొలిసారిగా గుర్తించారు.

నిపా వైరస్ ఉన్న గబ్బిలాలతో ప్రత్యక్ష లేదా పరోక్ష కాంటాక్ట్ ద్వారానే.. ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. వ్యాధి సోకిన గబ్బిలాల మూత్రం పండ్లు, ఇతర ఆహార పదార్థాల మీదకు చేరినప్పుడు వాటి ద్వారా మనుషులకు వ్యాపించే ప్రమాదముందని చెబుతున్నారు. అయితే, ఈ వైరస్ కు ప్రత్యేకమైన టీకా, చికిత్స లేకపోవడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

కరోనావైరస్‌తో పోలిస్తే నిపా వైరస్ అత్యంత ప్రమాదకరమైందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోగి నుంచి వచ్చే స్రావాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని చెప్పారు. ముఖ్యంగా రక్తం, మూత్రం, ముక్కు, నోటి నుంచి వచ్చే స్రావాల్లో వైరస్ ఉంటుంది. వ్యాధి సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులకే నిపా వైరస్ సోకే అవకాశం ఉంది. నిపా వైరస్‌లోని ప్రోటీన్లు మెదడు, కేంద్ర నాడీకణాల్లోనే కేంద్రీకృతమవుతాయి. దీంతో ఈ వైరస్ ప్రాణాంతకమని అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+